Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ముఖ్యమంత్రిని ఫిదా చేసిన మెకానిక్‌.. మారుతి స్విఫ్ట్‌ను లంబోర్గినీగా మార్చేశాడు..

ఇటాలియన్‌ సూపర్‌ స్పోర్ట్స్‌ కార్ల తయారీ దిగ్గజం లంబోర్గినీకి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అత్యాధునిక టెక్నాలజీ, అధునాతన ఫీచర్లను పెట్టింది పేరు ఈ కారు. రూ. కోట్ల ధర పలికే ఈ కారును సొంతం చేసుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తుంటారు. కానీ కొందరి ఆర్థిక..

Viral News: ముఖ్యమంత్రిని ఫిదా చేసిన మెకానిక్‌.. మారుతి స్విఫ్ట్‌ను లంబోర్గినీగా మార్చేశాడు..
Swift Modified As Lamborghini
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 04, 2022 | 9:01 AM

ఇటాలియన్‌ సూపర్‌ స్పోర్ట్స్‌ కార్ల తయారీ దిగ్గజం లంబోర్గినీకి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అత్యాధునిక టెక్నాలజీ, అధునాతన ఫీచర్లను పెట్టింది పేరు ఈ కారు. రూ. కోట్ల ధర పలికే ఈ కారును సొంతం చేసుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తుంటారు. కానీ కొందరి ఆర్థిక పరిస్థితి మాత్రమే దీనికి సహకరిస్తుంది. అయితే ఓ ఔత్సాహిక మెకానిక్‌ మారుతి స్విఫ్ట్‌ కారును లంబోర్గినీగా మాడిఫైడ్‌ చేసి ఏకంగా ముఖ్యమంత్రినే ఫిదా చేశాడు.

వివరాల్లోకి వెళితే.. అస్సాంలోని కరీంగంజ్‌కు చెందిన నూరుల్‌ హక్‌ అనే మెకానిక్‌ స్విఫ్ట్‌ కారును లంబోర్గినీగా మాడిఫై చేశాడు. ఈ కారును అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మకు బహుమతిగా అందించాడు. 31 ఏళ్ల కరీంగంజ్‌కు కార్లను రకరకాలుగా డిజైన్‌ చేయడం అలవాటు. ఈ క్రమంలోనే రూ. 10 లక్షల ఖర్చుతో మారుతి స్విఫ్ట్‌ కారును ఏకంగా లంబోర్గినీగా మాడిఫై చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఈ సందర్భంగా నూరుల్‌ హక్‌ మాట్లాడుతూ.. ‘నేను ఇంతకు ముందు నాగాలాండ్‌లో మెకానిక్‌గా పనిచేశాను. గతేడాది కూడా ఒక కారును ఇలాగే మాడిఫై చేశాను. అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మకు బహుమతిగా ఇవ్వడానికి ఈసారి లంబోర్గినీగా మార్చాను’ అని చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కూడా ఈ విషయంపై ట్వీట్ చేశారు. మెకానిక్‌ నూరుల్‌ హక్‌ తనకు లాంబోర్గి కారును బహుమతిగా ఇవ్వడం చాలా థ్రిల్‌గా ఉందంటూ రాసుకొచ్చారు. కాచార్‌ జిల్లాలోని పరిపాలన ప్రధాన కార్యాలయన్ని ముఖ్యమంత్రి సందర్శించిన సమయంలో ఈ లంబోర్గినీ కారును బహుమతిగా అందించారు. ఇదిలా ఉంటే నూరుల్ ప్రస్తుతం పాత కారును ఫెరారీగా మాడిఫై చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..