MCD Election 2022: ఢిల్లీ మున్సిపల్ పీఠం ఎవరిదీ..? త్రిముఖ పోరులో నెగ్గెదెవరు.. ప్రారంభమైన పోలింగ్..
ఢిల్లీలో మున్సిపల్ ఎన్నికల సమరం ఆరంభం అయ్యింది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5.30 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది.
ఢిల్లీలో మున్సిపల్ ఎన్నికల సమరం ఆరంభం అయ్యింది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5.30 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD Election) ఎన్నికల్లో 1.45 కోట్లమంది పౌరులు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 250 స్థానాలకు పోటీ జరుగుతుండగా అన్ని స్థానాల్లోనూ బీజేపీ, ఆమ్ ఆద్మీపార్టీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగనుంది. ఇక, కాంగ్రెస్ పార్టీ పునర్‌వైభవాన్ని కలగంటూ 247 మందిని బరిలోకి దింపింది. ఎంఐఎం కూడా 15 స్థానాల్లో పోటీ చేస్తోంది. మొత్తం 1349 మంది అభ్యర్థులు ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల బరిలో ఉన్నారు. MCD ఎన్నికల్లో 709 మంది మహిళలు బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 7న వెలువడనున్నాయి. ఎన్నికల దృష్ట్యా ఢిల్లీ అంతటా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. 70వేలకు పైగా ఢిల్లీలో పోలీసులను మోహరించారు. అదే సమయంలో ఓటింగ్‌ను డ్రోన్‌ల ద్వారా పర్యవేక్షించేందుకు ఏర్పాట్లు చేశారు.
గత 15 ఏళ్లుగా బీజేపీ..
ఎంసీడీలో గత 15 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. ఈ సారి కూడా విజయం సాధించేందుకు బీజేపీ ముమ్మరంగా ప్రచారం నిర్వహించింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా.. ఢిల్లీతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తోంది. అదే సమయంలో ఎంసీడీలో సత్తాచాటేందుకు కాంగ్రెస్ కూడా ప్రయత్నిస్తోంది.
ఢిల్లీలోని అన్ని మార్కెట్లు బంద్..
MCD ఎన్నికల దృష్ట్యా, ఢిల్లీలోని అన్ని హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లు మూసివేశారు. పాఠశాలలకు కూడా రేపటి వరకు సెలవులు ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుకోకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
Delhi | People queue up to cast their votes at a polling booth in Matiala village. Voting for #MCDElections2022 has begun pic.twitter.com/UqWjmUfTtE
— ANI (@ANI) December 4, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం..