AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: నేడు రాష్ట్రపతి పర్యటన.. ప్రధాన నగరాల్లో కట్టుదిట్టమైన భద్రత.. ట్రాఫిక్ ఆంక్షలతో బందోబస్తు..

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. కర్నూలులో డీఆర్డీవో నిర్మించిన నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్ తో పాటు నిమ్మలూరులో...

Andhra Pradesh: నేడు రాష్ట్రపతి పర్యటన.. ప్రధాన నగరాల్లో కట్టుదిట్టమైన భద్రత.. ట్రాఫిక్ ఆంక్షలతో బందోబస్తు..
President Murmu
Ganesh Mudavath
|

Updated on: Dec 04, 2022 | 7:51 AM

Share

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. కర్నూలులో డీఆర్డీవో నిర్మించిన నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్ తో పాటు నిమ్మలూరులో నిర్మించిన అడ్వాన్స్డ్ నైట్ విజన్ ప్రొడక్స్ ఫ్యాక్టరీ, కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఎన్ హెచ్ -340లో భాగంగా రాయచోటి నుంచి అంగళ్లు వరకు నిర్మించిన జాతీయ రహదారి, ఎన్ హెచ్- 205లో భాగంగా నిర్మించిన నాలుగు లైన్ల ఆర్వోబీ, ఎన్ హెచ్-342లో భాగంగా ముదిగుబ్బ నుంచి పుట్టపర్తి వరకు రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఎన్ హెచ్-44లో భాగంగా కర్నూలు టౌన్ లోని ఐటీసీ జంక్షన్ లో ఆరులైన్ల గ్రేడ్ సెపరేటెడ్ స్ట్రక్చర్, స్లిప్ రోడ్స్, డోన్ శివారులోని కంబాలపాడు జంక్షన్ తో పాటు వివిధ ప్రాంతాల్లో నిర్మించిన సర్వీస్ రోడ్లు, రాజమండ్రిలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్, సైన్స్ సెంటర్ ను రాష్ట్రపతి ప్రారంభించనున్నారు.

రాష్ట్రపతి పర్యటనతో రెండు నగరాల్లోనూ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం విజయవాడలో, సాయంత్రం విశాఖలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. విజయవాడ ఎయిర్‌పోర్ట్‌ను బలగాలు తమ ఆధీనంలో తీసుకున్నాయి. విజయవాడ ఎయిర్‌పోర్ట్‌ రన్‌వేతో పాటు రాష్ట్రపతి ప్రయాణించే పోరంకి – నిడమానూరు ప్రధాన రహదారిపై గస్తీ పెంచారు. రోడ్డుపై ఎలాంటి ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా బారికేడ్స్‌ ఏర్పాటు చేశారు. పౌర సన్మాన కార్యక్రమం జరిగే పోరంకిలో ఐదుగురు డీఎస్పీలు, 14మంది సీఐలు, 36మంది ఎస్సైలు, 8వందల మంది పోలీస్‌ సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. రాష్ట్రపతి ప్రయాణించే దారి పొడవునా ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు పోలీసులు.

విజయవాడ రాజ్‌భవన్‌కి వెళ్లే దారిలోనూ ట్రాఫిక్‌ ఆంక్షలు మళ్లింపులు చేపట్టారు. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై భారీ వాహనాలు, గూడ్స్‌ వెహికల్స్‌పైనా ఆంక్షలు పెట్టారు. నగరంలోకి ప్రవేశించకుండా నిషేధం విధించారు. ఆంక్షలకు అనుగుణంగా ట్రాఫిక్‌ మళ్లింపులు చేపట్టారు పోలీసులు. విశాఖ-హైదరాబాద్‌, విశాఖ-చెన్నై, గుంటూరు-విశాఖ, చెన్నై-హైదరాబాద్‌ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉండనున్నాయ్‌. విజయవాడ పర్యటన తర్వాత విశాఖ వెళ్లనున్నారు రాష్ట్రపతి ముర్ము. నేవీ డే ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గోనున్నారు. రాష్ట్రపతితోపాటు గవర్నర్‌, కేంద్ర-రాష్ట్ర మంత్రులు, నేవీ చీఫ్‌ హాజరుకానుండటంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

మరో వైపు.. నేవీ డే వేడుకలు సిద్ధమైన విశాఖ సిద్ధమైంది. తొలిసారిగా ఢిల్లీ బయట నేవీ డే వేడుకలు జరుగుతున్నాయి. ముఖ్య అతిధిగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు కానున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 3.25 గంటలకు నేవల్ ఎయిర్ స్టేషన్ ఐఎన్ఎస్ డేగాకు రాష్ట్రపతి చేరుకోనున్నారు. నేరుగా నేవీ డే ఉత్సవాలు జరిగే ఆర్కే బీచ్ కు వెళ్లి, భారత నేవీ శక్తి సామర్ధ్యాల ప్రదర్శన ఆపరేషన్ డెమోనస్ట్రేషన్ ను తిలకిస్తారు. సాయంత్రం 6.10 గంటలకు నేవీ హౌజ్ లో జరిగే నేవీ డే రిసెప్షన్లో పాల్గొంటారు. రాత్రి 8 గంటలకు విశాఖపట్నం నుంచి తిరుపతి కు రాష్ట్రపతి పయనమవుతారు.

మరిన్ని ఏపీ న్యూస్ కోసం