CM Jagan: మరోసారి ఔదార్యం చాటుకున్న ముఖ్యమంత్రి.. కాన్వాయ్ ఆపి.. బాధితుల దగ్గరకు వెళ్లి..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మరో సారి ఔదార్యం చాటుకున్నారు. కడప జిల్లా పర్యటనలో ఉన్న ఆయన పులివెందులలో ఓ రైతు, ఇద్దరు చిన్నారుల కష్టాలను చూసి చలించిపోయారు. హెలిప్యాడ్‌కు...

CM Jagan: మరోసారి ఔదార్యం చాటుకున్న ముఖ్యమంత్రి.. కాన్వాయ్ ఆపి.. బాధితుల దగ్గరకు వెళ్లి..
Andhra Pradesh CM YS Jagan Mohan Reddy
Follow us

|

Updated on: Dec 04, 2022 | 6:29 AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మరో సారి ఔదార్యం చాటుకున్నారు. కడప జిల్లా పర్యటనలో ఉన్న ఆయన పులివెందులలో ఓ రైతు, ఇద్దరు చిన్నారుల కష్టాలను చూసి చలించిపోయారు. హెలిప్యాడ్‌కు వెళ్తున్న సమయంలో రోడ్డుపక్కన దీనంగా నిలబడ్డ చిన్నారులను చూసి ఆగారు. సమస్య ఏంటని అడిగి తెలుసుకున్నారు. అనీమియాతో బాధపడుతున్న ఇద్దరు పిల్లల వైద్య ఖర్చుల కోసం హామీ ఇచ్చారు సీఎం జగన్‌. పులివెందులకు చెందిన ఈ ఇద్దరు పిల్లల వైద్యం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేశారు తల్లిదండ్రులు. ఉన్నదంతా అమ్ముకుని ట్రీట్‌మెంట్‌ చేయించామని, ఇక వైద్యం చేయించే స్తోమత లేదని మొర పెట్టుకోవడంతో ఆర్ధిక సహాయంపై భరోసా ఇచ్చారు సీఎం జగన్‌.

బ్రెయిన్‌ ట్యూమర్‌తో బాధపడుతున్న అనంతపురం రైతుకు ముఖ్యమంత్రి ధైర్యం చెప్పారు. ట్రీట్‌మెంట్‌కు రూ.20 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పడంతో ఆర్ధిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. తక్షణమే అకౌంట్లలో రెండు లక్షల చొప్పున అమౌంట్‌ వేయాలని అధికారులకు సూచించారు. గతంలోనూ అనేకసార్లు ఇలాగే ఓదార్యం చాటుకున్నారు సీఎం జగన్‌. అర్జీలతో నిలబడ్డ బాధితుల దగ్గరకెళ్లి, సమస్యలను అడిగి తెలుసుకోవడమే కాకుండా, ట్రీట్‌మెంట్‌ కోసం నిధులు విడుదల చేశారు.

గతంలోనూ.. అనంతపురం జిల్లా ధర్మవరం మండలానికి చెందిన యుగంధర్‌రెడ్డికి అండగా నిలబడ్డారు. అతని లివర్‌ దెబ్బతినడంతో వైద్యం కోసం చాలా మంది డాక్టర్ల వద్దకు వెళ్లారు. అయితే.. లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయాలని, అందుకు పెద్ద మొత్తంలో ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. అంత డబ్బు ఇవ్వలేని ఆయన ఎన్నో వ్యయ ప్రయాసకు ఓర్చి సీఎం జగన్ ను కలిశారు. తాను పడుతున్న ఇబ్బందులను వివరించారు. దీంతో అతని వైద్యానికి ఎంత అయినా ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ న్యూస్ కోసం

కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?