Viral Video: సముద్రంలో ప్రయాణిస్తుండగా ఊహించని షాక్.. క్షణాల్లోనే మునిగిన విలాసవంతమైన నౌక.. వీడియో చూస్తే గుండె దఢేల్..

కోట్లాది రూపాయలు విలువ చేసే నౌక సముద్రంలో మునిగిపోతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన శనివారం ఇటలీ సముద్ర తీరంలో చోటుచేసుకుంది.

Viral Video: సముద్రంలో ప్రయాణిస్తుండగా ఊహించని షాక్.. క్షణాల్లోనే మునిగిన విలాసవంతమైన నౌక.. వీడియో చూస్తే గుండె దఢేల్..
Viral Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 25, 2022 | 11:54 AM

Luxury Superyacht Viral Video: విలాసవంతమైన నౌక.. చూస్తే కళ్లు జిగేల్ అంటాయి.. అలాంటి నౌక సముద్రంలో విహరిస్తుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.. అలాంటి నౌక అకస్మాత్తుగా నీటిలో మునిగిపోయింది. కోట్లాది రూపాయలు విలువ చేసే నౌక సముద్రంలో మునిగిపోతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన శనివారం ఇటలీ సముద్ర తీరంలో చోటుచేసుకుంది. సుమారు 39.4 (129-అడుగులు) మీట‌ర్ల పొడుగు ఉన్న విలాస‌వంత‌మైన నౌక ఇట‌లీ తీరంలో అకస్మాత్తుగా మునిగింది. ఈ నౌక ఖ‌రీదు సుమారు 7.8 మిలియన్ల డాల‌ర్లు అని ఆ దేశ అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను ఇట‌లీ కోస్టుగార్డులు ట్విట్టర్‌లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.

మై సాగా (సూపర్‌యాచ్) పేరున్న ఈ విలాసవంతమైన ఓడ అయోనియన్ సముద్రంలో నీట మునిగినట్లు అధికారులు తెలిపారు. ఆ సమయంలో సూపర్‌యాచ్‌లో తొమ్మిది మంది సిబ్బంది ఉన్నారని .. వారందరినీ ఇటాలియన్ కోస్ట్ గార్డ్ విమానం ద్వారా రక్షించినట్లు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం గల్ఫ్ ఆఫ్ స్క్విలేస్ గుండా వెళ్తుండగా.. ఓడలోకి నీరు వచ్చాయని దీంతో అది నీట మునిగిపోయిందన్నారు. కేమన్ ఐలాండ్స్ ఫ్లాగ్‌తో ప్రయాణించే మై సాగా ఎవరిది అనేది స్పష్టంగా తెలియలేదు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో..

దీనిని ఇటాలియన్ షిప్ మేకర్ కాంటియరీ శాన్ మార్కో నిర్మించగా.. ప్రముఖ బ్రిటిష్ సూపర్‌యాచ్ డిజైనర్ టిమ్ హేవుడ్ దీనిని పూర్తిగా రూపొందించారు. కాగా.. ఇటాలియన్ కోస్ట్ గార్డ్ 15 ఏళ్ల లగ్జరీ యాచ్ మునిగిపోయే సమయంలో ఈ వీడియోను రికార్డు చేసి.. ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని.. దీని కారణాలపై అన్వేషిస్తున్నామని అధికారులు తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ