Telangana: కోదండరామ్‌తో వైఎస్‌ షర్మిల భేటీ.. సమస్యలపై ఐక్య పోరాటానికి పిలుపు..

నిరుద్యోగుల సమస్య , పేపర్‌లీక్‌లపై పోరాడేందుకు విపక్షాలు ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదాండరామ్‌తో ఆమె భేటీ అయ్యారు. ప్రభుత్వంపై కలిసికట్టుగా పోరాటం చేసేందుకు కలిసిరావాలని ఆహ్వానించారు.

Telangana: కోదండరామ్‌తో వైఎస్‌ షర్మిల భేటీ.. సమస్యలపై ఐక్య పోరాటానికి పిలుపు..
Ys Sharmila
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 04, 2023 | 1:49 PM

నిరుద్యోగుల సమస్య , పేపర్‌లీక్‌లపై పోరాడేందుకు విపక్షాలు ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదాండరామ్‌తో ఆమె భేటీ అయ్యారు. ప్రభుత్వంపై కలిసికట్టుగా పోరాటం చేసేందుకు కలిసిరావాలని ఆహ్వానించారు.

నిరుద్యోగులకు , విద్యార్ధులకు న్యాయం చేయడమే తన లక్ష్యమన్నారు షర్మిల. T-SAVE పేరుతో ఐక్యంగా ఉద్యమిద్దామని కోదండరామ్‌తో అన్నారు.

తెలంగాణ జనసమితి నిరుద్యోగులకు మద్దతుగా నిరంతరం పోరాటం చేస్తోందన్నారు కోదండరామ్‌. వైఎస్‌ షర్మిల ప్రతిపాదనపై పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

కోదండరామ్‌ని కలిసి వైఎస్ షర్మిల..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..