AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Sharmila: మంత్రి కేటీఆర్‌కు మద్దతుగా వైఎస్ షర్మిల ట్వీట్.. ఆ వ్యాఖ్యలు ఖండించాల్సేందేనంటూ..

YS Sharmila Supports Minister KTR: తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షుపై.. తిన్మార్ మల్లన్న పోల్ నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు

YS Sharmila: మంత్రి కేటీఆర్‌కు మద్దతుగా వైఎస్ షర్మిల ట్వీట్.. ఆ వ్యాఖ్యలు ఖండించాల్సేందేనంటూ..
Ys Sharmila Ktr
Shaik Madar Saheb
|

Updated on: Dec 25, 2021 | 9:38 AM

Share

YS Sharmila Supports Minister KTR: తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షుపై.. తిన్మార్ మల్లన్న పోల్ నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మంత్రి కేటీఆర్ సైతం ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ట్విట్ చేశారు. తాము ఎవ్వరిపై వ్యక్తిగత విమర్శలకు దిగడం లేదని అలాంటప్పుడు కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగి ఇబ్బందులకు గురి చేయడం ఏంటంటూ ప్రశ్నించారు. బీజేపీ నేతలు తన కుమారుడిని రాజకీయాల్లోకి లాగడం సిగ్గుచేటంటూ మండిపడ్డారు. అభివృద్ధి ఎక్కడ జరిగింది.. భద్రాచలం గుడిలోనా.. హిమాన్షు శరీరంలోనా..? అంటూ తీన్మార్‌ మల్లన్న పోల్‌ నిర్వహించడంపై కేటీఆర్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఫిర్యాదు చేశారు.

తెలంగాణ బీజేపీ నేతలకు నేర్పించేది ఇదేనా అంటూ కేటీఆర్ ఫైర్‌ అయ్యారు. తన కుమారుడిని రాజకీయాల్లోకి లాగడం, అతడి శరీరాకృతిని అవమానించడం సంస్కారమేనా అంటూ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. దిగజారుడు వ్యాఖ్యలు చేయకుండా నియంత్రించాలని.. ఇలాంటి వ్యాఖ్యలు చేయించాల్సిన పరిస్థితి తమకు కల్పించవద్దంటూ మంత్రి కోరారు. కాగా.. దీనిపై వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు.

మంత్రి కేటిఆర్‌కు మద్దతుగా వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. ఒక తల్లిగా, ఒక రాజకీయ నాయకురాలిగా ఇలాంటి నీచమైన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని పేర్కొన్నారు. మహిళల పట్ల కానీ చిన్న పిల్లల పట్ల గాని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినప్పుడు రాజకీయాలను పక్కన పెట్టి ఖండించాలంటూ సూచించారు. రాజకీయాలకు అతీతంగా ఇలాంటి వాటిని అందరూ ప్రశ్నించాలని షర్మిల ట్విట్ చేశారు.

Also Read:

PM Narendra Modi: యేసుక్రిస్తు జీవితం, బోధనలు అందరికీ స్ఫూర్తిదాయకం.. శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

Shampoo: షాంపూల్లో క్యాన్సర్‌ కారకాలు.. 30 ఉత్పత్తులను వెనక్కి తీసుకున్న కంపెనీ.. ఎక్కడంటే?