AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Sharmila : ప్రతిపక్షాలు చేతులకు గాజులు వేసుకుని డ్యాన్సులు చేస్తున్నారు.. దీక్ష విరమిస్తూ వైఎస్ షర్మిల కామెంట్స్

YS Sharmila ends fast : కొలువుల కోట్లాట కోసం వైఎస్ షర్మిల మూడు రోజుల పాటు చేసిన దీక్ష ముగిసింది.

YS Sharmila : ప్రతిపక్షాలు చేతులకు గాజులు వేసుకుని డ్యాన్సులు చేస్తున్నారు.. దీక్ష విరమిస్తూ వైఎస్ షర్మిల కామెంట్స్
Ys Sharmila
Venkata Narayana
|

Updated on: Apr 18, 2021 | 1:18 PM

Share

YS Sharmila ends fast : కొలువుల కోట్లాట కోసం వైఎస్ షర్మిల మూడు రోజుల పాటు చేసిన దీక్ష ముగిసింది. అమరవీరుల కుటుంబం చేతుల మీదుగా నిమ్మరసం తాగి హైదరాబాద్ బంజారాహిల్స్ లోని లోటస్ పాండ్ లో దీక్ష విరమించారు షర్మిల. తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల మంది నిరుద్యోగులున్నారు.. నిరుద్యోగులు చనిపోవడానికి తెలంగాణ ప్రభుత్వమే కారణమని షర్మిల ఈ సందర్భంగా ఆరోపించారు. రాష్ట్రంలో నియంతపాలన ఉందన్నారామె. దీక్ష స్థలి నుండి షర్మిల కేసీఆర్ సర్కారు మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిరుద్యోగులు చనిపోతే చలించని ఛాతీలో ఉంది గుండెనా బండరాయా? అంటూ ఒక దశలో ఆమె భావోద్వేగానికి గురయ్యారు. “పాలకులకు చిత్తశుద్ధి ఉందా? ప్రజలు అందరూ చూడాలి. నేను ఉద్యోగ దీక్ష ఎందుకు చేసానో అందరికీ తెలుసు. ఉద్యోగాలు రాక ఆత్మాభిమానం చంపుకోలేక మానసికంగా రోజు చనిపోతున్నారు. నిరుద్యోగులు చనిపోయేలా చేసింది కేసీఆర్. కేసీఆర్ మర్దరర్… వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వేల ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్రంలో నియంత పాలన ఉంది. ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు చేతులకు గాజులు వేసుకుని కేసీఆర్ ముందు డ్యాన్సులు చేస్తున్నారు. పాలకులకు భయం లేదు. వెనకాల దాక్కుని పోలీసుల భుజాల మీద తుపాకి పెట్టుకుని మమ్మల్ని టార్గెట్ గా పెట్టుకున్నారు.” అంటూ షర్మిల టీఆర్ఎస్ సర్కారుపై ఆరోపణలు గుప్పించారు.

Read also : Actress Sameera Reddy : సోనూసూద్, అర్జున్ రాంపాల్.. తాజాగా సినీనటి సమీరారెడ్డికి కరోనా పాజిటివ్