Actress Sameera Reddy : సోనూసూద్, అర్జున్ రాంపాల్.. తాజాగా సినీనటి సమీరారెడ్డికి కరోనా పాజిటివ్

Actress Sameera Reddy tests positive for COVID 19 : సినీ నటి సమీరారెడ్డి కరోనా బారినపడ్డారు..

Actress Sameera Reddy : సోనూసూద్, అర్జున్ రాంపాల్.. తాజాగా  సినీనటి సమీరారెడ్డికి కరోనా పాజిటివ్
Sameera Reddy
Follow us
Venkata Narayana

|

Updated on: Apr 18, 2021 | 12:13 PM

Actress Sameera Reddy tests positive for COVID 19 : సినీ నటి సమీరారెడ్డి కరోనా బారినపడ్డారు. నిన్న కరోనా లక్షణాలు కనిపించడంతో ఇవాళ టెస్ట్ చేయించుకుంటే ఆమెకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే, భర్త, ఇద్దరు పిల్లలు కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు.  వాళ్ల రిపోర్టులు రావాల్సి ఉంది. కాగా, సమీరారెడ్డి ఫ్యామిలీ గోవాకు షిఫ్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆమె ఆరునెలలుగా గోవాలోనే ఉంటున్నారు. అటు, సినీనటులు సోనూసూద్, అర్జున్ రాంపాల్ కూడా తాజాగా కరోనా బారినపడ్డారు. టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవితో కలిసి జై చిరంజీవ, ఎన్టీఆర్‏తో అశోక్ సినిమాలో నటించిన సమీరా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఆ తర్వాత బాలీవుడ్‏లో వరుస ఆఫర్లను అందుకున్న ఆమె, ఆ తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమయ్యారు. ప్రస్తుతం భర్త, ఇద్దరు పిల్లలతో పూర్తిస్థాయిలో ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తోంది సమీరా. ఇక, బాలీవుడ్ ఇండస్ట్రీలో నెపోటిజమ్ గురించి సమీరారెడ్డి అప్పట్లో షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తాను గర్భంతో ఉన్నప్పుడు ఎదుర్కోన్న సంఘటనల గురించి కూడా ఆమె అప్పట్లో గుర్తు చేసుకుంది. మొదటి సారి తాను ప్రెగ్నెంట్‏గా ఉన్నప్పుడు తనలో వచ్చిన మార్పులు చూసి తనకు తానే నచ్చలేదని తెలిపింది.

అంతేకాకుండా సోషల్ మీడియాలో తన గురించి జనాలు చేసే కామెంట్లు కూడా దారుణంగా ఉండేవని.. వాటిని చూసి చాలా బాధపడేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. తన బాడీ గురించి జనాలు చేసే కామెంట్లు చూసినప్పుడు బాధనిపించినా .. తర్వాత వాటిని పెద్దగా పట్టించుకోలేదని తెలిపింది. ఇక రెండవ సారి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అలాంటి కామెంట్లను పట్టించుకోలేదని.. మరోసారి అమ్మ అవుతున్నందుకు సంతోషంగా ఉండేదని తెలిపింది. అయితే, ఇలాంటి కామెంట్ల వల్ల అమ్మాయిలు కూడా ఇబ్బందులు పడతారని సమీరా చెప్పుకొచ్చింది.

Read also : Etela : వ్యాక్సిన్ లేనందునే ఇవాళ తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆగిపోయింది : వైద్య ఆరోగ్య శాఖ మంత్రి