Etela : వ్యాక్సిన్ లేనందునే ఇవాళ తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆగిపోయింది : వైద్య ఆరోగ్య శాఖ మంత్రి

Health Minister Etela : కరోనా సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరంగా ఉందన్నారు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్...

Etela :  వ్యాక్సిన్ లేనందునే ఇవాళ తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆగిపోయింది : వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
etela
Follow us
Venkata Narayana

|

Updated on: Apr 18, 2021 | 11:59 AM

Telangana Minister of Medical, Health and Family Welfare Etela : కరోనా సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరంగా ఉందన్నారు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. తెలంగాణలో వ్యాక్సిన్ లేకపోవడం వల్లే ఇవాళ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోయిందని వివరణ ఇచ్చారు. కోవిడ్ వ్యాక్సిన్ కొరత సమస్యను కేంద్రం సత్వరమే పరిష్కరించాలని ఆయన కోరారు. రేపటి నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ యథాతదంగా కొనసాగుతుందని ఆయన చెప్పారు. ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ను ప్రయివేటు ఆస్పత్రులు పాటించాలని ఈటల ఆదేశించారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదని, అయితే, కేంద్రం ఆక్సిజన్ కొరత, టీకాల కొరత లేకుండా చూసుకోవాల్సి ఉందని ఆయన వెల్లడించారు. అటు, రేపటి నుంచి రెమ్ డెసివర్ కొరత లేకుండా చూస్తామని కూడా ఈటల తెలిపారు. తెలంగాణలో 95 శాతం మందికి కరోనా వ్యాధి లక్షణాలు లేవని ఈటల అన్నారు. ప్రజలంతా ఎవరికి వారు కరోనా మహమ్మారి బారినపడకుండా తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉందన్నారు. కేవలం ఐదు శాతం మందికే కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. అందువల్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. లక్షణాలు లేనప్పటికీ ఎవరికివారు భౌతికదూరం పాటిస్తూ కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందాలని ఈటల రాష్ట్ర ప్రజానీకాన్ని కోరారు.

Read also : PM Modi : వారణాసిలో కోవిడ్-19 పరిస్థితిపై ప్రధాని మోదీ సమీక్ష, ఉన్నతాధికారులు, స్థానిక పరిపాలన, వైద్యులతో కీలక మీటింగ్