సిటీ బస్సులో విండో సీటు దగ్గర కూర్చున్నాడు.. కాసేపటికే అచేతనంగా.. పోలీసులు ఆరా తీయగా షాకింగ్

మనలో చాలామంది బస్సు గానీ, కార్ గానీ ఎక్కగానే కిటికీ పక్కన సీటు కోసం చూస్తాం. చాలామంది ముందుగానే కర్చీఫ్ వేసి మరీ విండ్ సీటు కోసం ఆరాటపడతారు.

సిటీ బస్సులో విండో సీటు దగ్గర కూర్చున్నాడు.. కాసేపటికే అచేతనంగా.. పోలీసులు  ఆరా తీయగా షాకింగ్
TSRTC
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 18, 2021 | 10:43 AM

మనలో చాలామంది బస్సు గానీ, కార్ గానీ ఎక్కగానే కిటికీ పక్కన సీటు కోసం చూస్తాం. చాలామంది ముందుగానే కర్చీఫ్ వేసి మరీ విండ్ సీటు కోసం ఆరాటపడతారు. ప్రశాంతంగా గాలి వస్తుందని, చుట్టూ ప్రపంచాన్ని చూడొచ్చని వారి అభిప్రాయం. అయితే విండో సీట్‌లో కూర్చున్నవాళ్లు అప్రమత్తంగా ఉండాలి. లేకుంటే ప్రమాదాలు తప్పవు. తాజాగా బస్సులో కిటికీ పక్కన సీట్లో కూర్చున ఒక యువకుడు అనూహ్యంగా మృతి చెందాడు. హైదరాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే… పెద్దపల్లికి చెందిన కుమ్మరి కనకరాజు అనే వ్యక్తికి ఇద్దురు కొడుకులు ఉన్నారు. పెద్ద తనయుడు 23 ఏళ్ల పవన్ చైతన్య బీటెక్ కంప్లీట్ చేశాడు. అనంతరం జాబ్ కోసం టెక్నికల్ ట్రైనింగ్ తీసుకునేందుకు హైదరాబాద్ వచ్చి.. ఎస్ ఆర్ నగర్ లోని ఓ ప్రైవేటు హాస్టల్ లో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నాడు. శనివారం ఉదయం హాస్టల్ నుంచి స్నేహితుల వద్దకు వెళ్లాడు. ఆ తర్వాత తిరిగి వచ్చేందుకు పటాన్ చెరు నుంచి దిల్ సుఖ్ నగర్ వస్తున్న సిటీ బస్సు ఎక్కాడు. బస్సులో విండో సీట్ పక్కనే కూర్చున్నాడు. అయితే కోఠిలోని గోకుల్ ఛాట్ వద్దకు చేరుకున్న సమయంలో తోటి సాసింజర్స్ చైతన్య అచేతనంగా ఉండడం గమనించారు. ఏంటా అని పరిశీలించగా అతడి తలకు గాయాలయ్యాయనీ, తీవ్రంగా రక్తస్రావం అవుతోందని గుర్తించారు. వెంటనే బస్సును పక్కన ఆపించి 108కు కాల్ చేశారు. అంబులెన్స్ లో అతడిని ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. అయితే అప్పటికే చైతన్య చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. బస్సులో కూర్చున్న వ్యక్తికి అసలు గాయాలు ఎలా అయ్యాయా? అని ఎంక్వైరీ చేస్తే పోలీసులకు ఓ షాకింగ్ నిజం తెలిసింది. ఆర్టీసీ డ్రైవర్ అశ్రద్దతో డ్రైవింగ్ చేయడమే ఆ కుర్రాడి ప్రాణం తీసిందన్న నిజం వెలుగుచూసింది. ఓ బస్సును ఓవర్ టేక్ చేసేందుకు చైతన్య ప్రయాణిస్తున్న బస్సు డ్రైవర్ ట్రై చేశాడు. ఈ క్రమంలోనే చైతన్య ఉన్న బస్సు టైరు భారీ గుంతలో పడింది. దాంతో చైతన్య తల కిటికీ అద్దానికి బలంగా తగిలి.. తీవ్ర రక్తస్రావం అయింది.బస్సులో చైతన్య కూర్చున్న కుడివైపున బస్సు స్వల్పంగా దెబ్బతిన్నట్లు పోలీసులు గుర్తించారు.  చైతన్య ఫోన్లో ఉన్న నెంబర్ల ఆధారంగా అతడి  పేరెంట్స్‌కు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: కన్నకూతుర్ని పాడు చేసినందుకే నరమేధం అన్న అప్పలరాజు.. బాధితుడు విజయ్ వెర్షన్ ఇది‌

పదే పది రోజులు.. ఆ ఇంట్లో ముగ్గురు మృతి.. కారణాలు వేరైనా గ్రామస్తులను వెంటాడుతున్న కరోనా భయం