Viral News: సండే దావత్ కోసం కక్కుర్తి..! సీసీ టీవీలో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన కోడి దొంగ

అసలే సండే.. చికెన్ లేకుండా రోజు గడవడం చాలా కష్టం. రేట్లు ఏమో సుర్రుమంటున్నాయి. అందుకేనేమో కోళ్ల ఫారంలోకి చొరబడి మరీ కోడిని దొంగతనం చేశాడు ఓ వ్యక్తి.

Viral News: సండే దావత్ కోసం కక్కుర్తి..!  సీసీ టీవీలో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన కోడి దొంగ
Stole The Chicken
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 18, 2021 | 1:10 PM

అసలే సండే.. చికెన్ లేకుండా రోజు గడవడం చాలా కష్టం. రేట్లు ఏమో సుర్రుమంటున్నాయి. అందుకేనేమో కోళ్ల ఫారంలోకి చొరబడి మరీ కోడిని దొంగతనం చేశాడు ఓ వ్యక్తి. ఏప్రిల్ 18న తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెరుమాల్ అనే మాజీ గ్రామ పరిపాలన అధికారికి ఊరికి సమీపంలో తోట ఉంది. అతను ఈ తోటలో కోళ్లను పెంచుతున్నాడు. కాగా, ఆదివారం మోటారుసైకిల్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ఆ తోటలోకి ప్రవేశించి.. ఎంచక్కా ఒక కోడిని సంకలో పెట్టుకుని వెళ్లిపోయాడు. అయితే అక్కడ సీసీ కెమెరాల గురించి మాత్రం అతడు పట్టించుకోలేదు. దీంతో ఇన్సిడెంట్ మొత్తం సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఎప్పట్లాగే పొద్దున్నే తోటకు వచ్చిన పెరుమాల్.. ఫుటేజ్ చెక్ చేయగా విషయం అర్థమయ్యింది. కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్‌తో పెరుమాల్ సరాసరి పొన్నమారావతి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు. 

కోడిని దొంగిలించిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కోడి పోయిందని వ్యక్తి ఆధారాలతో సహా కంప్లైంట్ చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. అయితే ఇక్కడ పెరుమాల్ వెర్షన్ మాత్రం వ్యాలిడ్‌గానే ఉంది. “ఇవాళ ఒక కోడి.. తీసుకెళ్లివారు.. రేపు పెద్ద వాహనంలో వచ్చి అన్ని కోళ్లను దొంగలించవచ్చు. ఒక మర్డర్ చేసినా, వంద మర్డర్లు చేసినా హంతకుడు, హంతకుడే. ఒక కోడి దొంగలించినా, 100 కోళ్లు దొంగిలించినా దొంగ దొంగే” అంటూ కరెక్ట్ పాయింటే మాట్లాడుతున్నాడు.  

Also Read: సిటీ బస్సులో విండో సీటు దగ్గర కూర్చున్నాడు.. కాసేపటికే అచేతనంగా.. పోలీసులు ఆరా తీయగా షాకింగ్

ఐఏఎస్ చదివే యువకుడు అకస్మాత్తుగా సూసైడ్.. విచారణలో పోలీసులకు మైండ్ బ్లాంక్.. వామ్మో ఏం స్కెచ్