ఐఏఎస్ చదివే యువకుడు అకస్మాత్తుగా సూసైడ్.. విచారణలో పోలీసులకు మైండ్ బ్లాంక్.. వామ్మో ఏం స్కెచ్

ఐఏఎస్ కావాల్సిన కలలు కన్న ఓ  యువకుడు అకస్మాత్తుగా బలవన్మరణానికి పాల్పడ్డాడు. అంత బాగా చదువుకునే వ్యక్తి ఎందుకు సూసైడ్ చేసుకున్నాడో పేరెంట్స్‌కు అర్థం కాలేదు.

  • Ram Naramaneni
  • Publish Date - 11:17 am, Sun, 18 April 21
ఐఏఎస్ చదివే యువకుడు అకస్మాత్తుగా సూసైడ్.. విచారణలో పోలీసులకు మైండ్ బ్లాంక్.. వామ్మో ఏం స్కెచ్
Video Call Seduce

ఐఏఎస్ కావాల్సిన కలలు కన్న ఓ  యువకుడు అకస్మాత్తుగా బలవన్మరణానికి పాల్పడ్డాడు. అంత బాగా చదువుకునే వ్యక్తి ఎందుకు సూసైడ్ చేసుకున్నాడో పేరెంట్స్‌కు అర్థం కాలేదు. ఈ క్రమంలో అతడి ఫోన్‌కు వచ్చిన మెసేజ్ కేసు మిస్టరీని సాల్వ్ చేసింది. వెంటనే మెసేజ్ చదివిన మృతుడి సోదరి.. పోలీసుల వద్దకు పరుగుపెట్టింది. సైబర్ కేటుగాళ్ల  వలలో పడి తన అన్న సూసైడ్ చేసుకున్నాడని ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పోలీసులు తీగ లాగితే.. డొంక కదిలింది. అనుమానితులను పీఎస్‌కు తీసుకొచ్చి.. తమదైన స్టైల్లో వాయింపు ఇవ్వడంతో.. ఈ కిలాడీ బ్యాచ్ వ్యవహారం బయటపడింది. అయితే పోలీసులు తొలుత ఇది హనీ ట్రాప్ వ్యవహారం అనుకున్నారు. ఓ అమ్మాయి న్యూడ్ కాల్స్ మాట్లాడి.. ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసిందని భావించారు. అయితే అసలు అక్కడ అమ్మాయే లేకుండా న్యూడ్ కాల్ చేసిన ఈ కంత్రీ బ్యాచ్ అతి తెలివితేటలు చూసి నిర్ఘాంతపొయ్యారు.

వివరాల్లోకి వెళ్తే..  భత్తరహళ్లికి చెందిన యువకుడు ఐఏఎస్ అవ్వాలనే లక్ష్యంతో ప్రిపేర్ అవుతున్నాడు. అతనికి ఫేస్‌బుక్ ఖాతాకు ఓ అమ్మాయి నుంచి ఫ్రెండ్‌షిప్ రిక్వెస్ట్ రావడంతో యాక్సెప్ట్ చేశాడు. అదే అతడు చేసిన తప్పు. అనంతరం.. ఆ యువకుడిని బుట్టలో వేసుకుని.. నవ్వించి, కవ్వించి న్యూడ్ వీడియో కాల్ వరకూ తీసుకెళ్లారు. ఆ తర్వాత కొద్దిసేపటికే అతడు మాట్లాడిన న్యూడ్ వీడియోలు…వాట్సాప్‌లో ప్రత్యక్షమయ్యాయి. వీడియోలు పంపించిన సైబర్ నేరగాళ్లు డబ్బులు కోసం వేధించడం స్టార్ట్ చేశారు. అప్పటికీ కొంత అడ్జెస్ట్ చేశాడు. పదే, పదే వారు కాల్స్ చేస్తూ, మెసేజ్‌లు పెడుతూ డబ్బులు కోసం ఇబ్బంది పెట్టడంతో ఒత్తిడి తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు.

అనంతరం మెసేజ్ ఆధారంగా విచారణ చెయ్యగా.. నిందితులు రాబిన్(22), జావేద్(25) రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లిన పోలీసులకు చుక్కలు కనిపించాయి. నిందితులను పట్టుకునేందుకు వచ్చారని తెలిసి గ్రామస్తులు పోలీసులపై విరుచుకుపడ్డారు. విషయం వెంటనే భరత్‌పూర్ ఎస్పీకి తెలియజేసి.. 40 మంది స్థానిక పోలీసులను సాయంగా పంపించడంతో అతికష్టమ్మీద నిందితులను అరెస్టు చేసి బెంగళూరుకు తీసుకొచ్చారు.

నిందితులను విచారించగా పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు తెలిశాయి. కేవలం ఫోన్‌తోనే మృతుడికి చుక్కలు చూపించారు. స్మార్ట్‌ఫోన్ సాయంతో యువతి న్యూడ్ వీడియో కాల్ చేస్తున్నట్లు అతడిని నమ్మించారు. ఫోర్న్ వీడియోలను కట్ చేసి.. అమ్మాయి బట్టలు విప్పేస్తున్నట్లు చూపించి.. అతని ఒంటిపై దుస్తులు రిమూవ్ చేయించారు. ఆ వీడియోలను రికార్డ్ చేసి వేధింపులు షురూ చేశారు. అయితే అసలు అమ్మాయి లేకుండానే యువతితో న్యూడ్ వీడియో కాల్ చేసినట్లు తేలడంతో పోలీసులు ఖంగుతిన్నారు.

Also Read: కన్నకూతుర్ని పాడు చేసినందుకే నరమేధం అన్న అప్పలరాజు.. బాధితుడు విజయ్ వెర్షన్ ఇది‌

సిటీ బస్సులో విండో సీటు దగ్గర కూర్చున్నాడు.. కాసేపటికే అచేతనంగా.. పోలీసులు ఆరా తీయగా షాకింగ్