Telangana: ఆ ఒక్క తప్పు అతడి జీవితాన్ని అంతం చేసింది…

ఉద్యోగ అన్వేషణలో భాగంగా పట్నం పోయాడు. అక్కడ స్నేహితుల ద్వారా అంటిన ఆన్ లైన్ బెట్టింగ్ వ్యసనం చివరకు ఆ యువకుడి ఆయువు మింగేసింది.. ఆన్ లైన్ బెట్టింగ్స్‌కు బానిసగా మారిన యువకుడు.. అప్పుల భారంతో ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. వివరాలు తెలుసుకుందాం పదండి...

Telangana: ఆ ఒక్క తప్పు అతడి జీవితాన్ని అంతం చేసింది...
Rajkumar
Follow us
G Peddeesh Kumar

| Edited By: Ram Naramaneni

Updated on: Jan 11, 2025 | 11:42 AM

వరంగల్‌ జిల్లాలో ఆన్‌లైన్ బెట్టింగ్‌కు యువకుడు బలయ్యాడు. ఈ ఘటన వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో జరిగింది.. రాజ్ కుమార్ (26) అనే యువకుడు ఆన్లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడి ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  మృతుడు రాజ్ కుమార్ తండ్రి కుమారస్వామి కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.. ఇతనికి ముగ్గురు కుమారులు… మొదటి కుమారుడు పోలీస్ శాఖలో ఉద్యోగం చేస్తుండగా.. రెండవ కుమారుడయిన మృతుడు రాజ్ కుమార్ ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా హనుమకొండలో ఫ్రెండ్స్‌తో కలిసి ఉంటూ కోచింగ్‌కు వెళ్లేవాడు. ఈ క్రమంలో స్నేహితుల ద్వారా ఆన్ లైన్ లో పేకాట బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు..

కేవలం ఒక్క ఏడాది వ్యవధిలోనే సుమారు 30 లక్షల రూపాయలకు పైగా నష్టపోయినట్లు మృతుడు తండ్రి కుమారస్వామి తెలిపారు.. గత వారం రోజుల నుండి 4 లక్షల రూపాయలు కావాలని తల్లిదండ్రులను వేధించాడు.  తమ వద్ద అంతా డబ్బు లేవుని చెప్పడంతో పలుమార్లు ఆత్మహత్యకు ప్రయత్నం చేశాడు. బెదిరిస్తున్నాడని అనుకున్నారు.. కానీ శనివారం ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఐతే తన కుమారుడు లాంటి ఎంతోమంది యువకులు ఇటువంటి ఆన్లైన్ మోసాలకు బలైపోతున్నారని ప్రభుత్వం ఆన్లైన్ బెట్టింగ్‌లను రద్దుచేసి ఇలాంటి మోసాల నుండి యువతను రక్షించాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు.

ఈజీ మనీ కోసం ఎంతోమంది బెట్టింగులు ఆడుతున్నారు. వాటికి బానిసలుగా మారి అప్పుల పాలవుతున్నారు. వాటిని ఎలా తీర్చాలో అర్థం కాక చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాము ఇబ్బందులు పడటమే కాకుండా కుటుంబం మెుత్తాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారు. యువతీయువకులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈజీ మనీ కోసం ఆన్ లైన్ బెట్టింగుల జోలికి మాత్రం వెళ్లవద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..