MLC Kavitha: కొందరు అద్భుతంగా రాణించారు.. మరికొందరు చేతులెత్తేశారు..? కవిత పరిస్థితి ఏంటి..?
దేశంలో రాజకీయ పార్టీలు పెట్టిన మహిళలు కొందరు అద్భుతంగా రాణించారు. మరికొందరు పార్టీని నడపలేక మధ్యలో జెండా కిందపడేశారు. అప్పటికే పెట్టిన పార్టీని లీడ్ చేసి సక్సెస్ సాధించిన వీర వనితలు కొందరైతే.. కొత్తగా పార్టీ పెట్టి విజయభేరి మోగిస్తున్న నారీమణులు ఇంకొందరు. మరి.. బీఆర్‌ఎస్ నుంచి సస్పెన్షన్‌కి గురైన కవిత.. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? కొత్తగా పార్టీ పెడతారా? ఆమె రాజకీయ కార్యాచరణ ఎలా ఉండబోతోంది?

పురుషాధిక్య సమాజంలో మహిళా నాయకులు మేము సైతం అన్నారు…దేశ రాజకీయాల్లో చెరగని ముద్రవేశారు.. రాష్ట్రాన్ని.. దేశాన్ని పాలించే నేతలుగా ఎదిగారు. జయలలిత, మమతా బెనర్జీ, మాయావతి, మెహబూబా ముఫ్తీ, జానకీ రామచంద్రన్ లాంటి వాళ్లు సీఎం పీఠంపై కూర్చోగా.. సోనియాలాంటి వాళ్లు యూపీఏను లీడ్ చేశారు. విజయశాంతి, లక్ష్మీపార్వతి, మేనకాగాంధీ, కొత్తపల్లి గీత, గౌరియమ్మ, వైఎస్ షర్మిల లాంటి వాళ్లు పార్టీ పెట్టి చేతులు కాల్చుకున్నారు. ఇక పార్టీ పెట్టకుండానే రాజకీయ యవనిక నుంచి తప్పుకున్నారు జయలలిత అనుచరురాలు శశికళ. ఏతావాతా చెప్పొచ్చేదేంటంటే.. దేశంలో పొలిటికల్ పార్టీలను స్థాపించి లీడ్ చేయడంలో అతివలకు మిశ్రమ ఫలితాలు వచ్చాయనే చెప్పాలి. ఇంతకు ఎవరు సక్సెస్ అయ్యారు.. ఎవరు ఫెయిల్ అయ్యారో తెలుసుకుందాం.. విజయశాంతి.. లేడీ అమితాబ్‌గా గుర్తింపు పొందారు. 1998లో రాజకీయ అరంగేట్రం చేసి.. ముందుగా బీజేపీలో చేరారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2005లో తల్లి తెలంగాణ పార్టీ స్థాపించారు. అనంతరం 2009లో తెలంగాణ రాష్ట్ర సమితిలో పార్టీని విలీనం చేశారు. 2009లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2013లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని టీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ అయ్యారు. 2014 ఫిబ్రవరిలో కాంగ్రెస్‌లో చేరారు విజయశాంతి. పార్టీలో అంతగా ఆదరణ లేదంటూ 2020 డిసెంబర్‌లో రెండోసారి కమలం తీర్థం పుచ్చుకున్నారు. అక్కడ ఇమడలేక తిరిగి కాంగ్రెస్ గూటికి చేరి ప్రస్తుతం ఎమ్మెల్సీగా...




