Telangana: చెరుకు రసం తీస్తుండగా యంత్రంలో ఇరుక్కున్న మహిళ సిగ.. ఆ తర్వాత..
చెరుకురసం వ్యాపారం నిర్వహించే మహిళ ఊహించని ప్రమాదంలో చిక్కుకుంది.. ఆమె చెరుకురసం తీసేందుకు ప్రయత్నిస్తుండగా జుట్టు చెరకు యంత్రంలో చిక్కుకొని సుమారు గంటకు పైగా మృత్యువుతో పోరాటం చేసింది.. ఎట్టకేలకు స్థానికుల సహకారంతో ప్రాణాలతో బయటపడింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి...

చెరుకు రసం విక్రయం జరిపే ఓ మహిళ జడ యంత్రంలో ఇరుక్కుపోయిన ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలో జరిగింది.. చెరుకు రసం వ్యాపారం చేస్తోన్న ఆ మహిళకు తృటిలో పెను ప్రమాదం తప్పింది.. మహిళ జుట్టు చెరుకు యంత్రంలో ఇరుక్కోవడంతో నొప్పితో విలవిల్లాడుతూ.. భయంతో కేకలు పెట్టింది. ఆ మహిళ పరిస్థితిని గమనించిన స్థానికులు వెంటనే విద్యుత్ సరఫరా నిలిపి వేయడంతో పెను ప్రమాదం నుండి బయటపడింది..
ఉపాధి కోసం ఆంద్రప్రదేశ్ నుంచి మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రానికి వలసవచ్చిన రజినీ అనే మహిళ చెరుకు రసం అమ్ముకుంటూ కుటుంబంతో సహా జీవనం సాగిస్తుంది. రోజు మాదిరిగా చెరుకు రసం తయారుచేసే క్రమంలో ఆమె పొడవాటి కురుకు చెరుకు యంత్రంలో ఇరుక్కపోయాయి.
డోర్నకల్ పోస్టాఫీసు సమీపం ఈ ఘటన జరిగింది.. రజినీ చెరుకురసం తీస్తుండగా ప్రమాదవశాత్తు మహిళ జుట్టు ఇనుప చక్రాల మధ్య ఇరుక్కుంది.. ఆమె అరుపులు విని వెంటనే గమనించిన స్థానికులు విద్యుత్ సరఫరా నిలిపి వేశారు.. ఆ యంత్రాన్ని రివర్స్ తీసి కాపాడారు.. ఈ ఘటనలో మహిళ చేతికి స్వల్ప గాయమైంది.. ఆమెను ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.. మృత్యుంజయురాలైన మహిళ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్చ పొందుతుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..