Telangana: గర్భిణి ప్రసవానికి వాగు గండం.. గత్యంతరం లేక పురిటి నొప్పులతో గట్టు పైనే

అడవి బిడ్డలకు కష్టాలు వాగు కష్టాలు తప్పడంలేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనేక గ్రామాలకు రాకపోకలు తీవ్ర ఇబ్బందిగా మారాయి....

Telangana: గర్భిణి ప్రసవానికి వాగు గండం.. గత్యంతరం లేక పురిటి నొప్పులతో గట్టు పైనే
Pegnancy Woman
Follow us

|

Updated on: Jul 19, 2022 | 10:37 AM

అడవి బిడ్డలకు కష్టాలు వాగు కష్టాలు తప్పడంలేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనేక గ్రామాలకు రాకపోకలు తీవ్ర ఇబ్బందిగా మారాయి. అత్యవసర పరిస్థితిలో ఆస్పత్రులకు వెళ్లాలంటే వృద్ధులు, గర్భిణుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఓ గర్భిణి వాగు దాటుతుండగా పురిటి నొప్పులు రావడంతో వాగు గట్టునే ప్రసవించింది. ఈ దయనీయ ఘటన ఆదిలాబాద్‌ (Adilabad) జిల్లాలో జరిగింది. జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం హర్కాపూర్‌ పంచాయతీ మామిడిగూడ కు చెందిన గర్భిణి ఉయిక గాంధారి వాగు దగ్గర ప్రసవించింది. జూలై 18 ఉదయం ఆమె పురిటి నొప్పులతో బాధపడుతుండగా గ్రామస్థులు ఆమెను ఇంద్రవెల్లి పీహెచ్‌సీకి తరలించేందుకు సిద్ధమయ్యారు.

ఈ క్రమంలో మామిడిగూడ వాగు దాటుతుండగా ఉన్నట్టుండి గర్భిణికి పురిటి నొప్పులు ఎక్కువ అయ్యాయి. దాంతో ఆమె వాగు ఒడ్డునే ప్రసవించింది. సమాచారం అందుకున్న పిట్టబొంగరం పీహెచ్‌సీ హెచ్‌ఈవో అశోక్‌, వాల్గొండ ఏఎన్‌ఎం జానాబాయి, ఆశా కార్యకర్త మైనాబాయి వాగు దాటి వెళ్లారు. గ్రామస్థుల సహాయంతో తల్లీ, బిడ్డలను క్షేమంగా వాగు దాటించారు. అంతేకాదు బాలింత ఆస్పత్రికి చేరేందుకు ఏకంగా ఒకటిన్నర కిలోమీటర్లు నడిచింది. అక్కడినుంచి అంబులెన్స్‌లో ఇంద్రవెల్లి పీహెచ్‌సీకి తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!