Telangana: కామారెడ్డి యాక్సిడెంట్ ఘటనలో మరో ట్విస్ట్.. డబ్బు కోసమే అలా చేశారా
కామారెడ్డి (Kamareddy) లో ఆటో - లారీ ఢీ ఘటనలో మరో షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన అస్ఫాక్ ఆటోను హైదరాబాద్ కు చెందిన ముజీబ్ దొంగలించినట్లు అధికారులు గుర్తించారు. యాక్సిడెంట్ అయిన ఆటోను సోమవారం...
కామారెడ్డి (Kamareddy) లో ఆటో – లారీ ఢీ ఘటనలో మరో షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన అస్ఫాక్ ఆటోను హైదరాబాద్ కు చెందిన ముజీబ్ దొంగలించినట్లు అధికారులు గుర్తించారు. యాక్సిడెంట్ అయిన ఆటోను సోమవారం ఉదయమే చోరీ చేశారు. మద్నూర్ మీదుగా హైదరాబాద్ తీసుకెళ్లి అమ్ముకునే ప్రయత్నం లో ప్రమాదం జరిగింది. దారి ఖర్చులు, డీజిల్ డబ్బుల కోసం ఆటోలో ప్రయాణికులను ఎక్కించుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలోని (Telangana) కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-ఆటో ఢీకొన్న ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. జాతీయ రహదారిపై వెళ్తున్న ఆటోను.. అటుగా వస్తున్న లారీ వేగంతో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో నుజ్జునుజ్జు అయి లారీ కింద చిక్కుకుపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
కాగా.. ఈ ఆటో నిజామాబాద్ జిల్లా రుద్రూరుకు చెందిన షేక్ అస్వక్‌ది గా పోలీసులు గుర్తించారు. ఆదివారం రాత్రి ఆటోను చోరీ చేసిన దొంగలు మహారాష్ట్రలోని డెగ్లూర్ వెళ్లారు. అక్కడ బైక్ ను ఢీ కొట్టారు. తర్వాత తెలంగాణలోని మద్నూర్ వచ్చారు. మార్గమధ్యలో ఓ విద్యార్థినిని ఎక్కించుకుని రాంగ్‌రూట్లో వస్తూ లారీని ఢీకొట్టారు. ఈ ఘటనలో ఆరుగురు మృత్యువాతపడ్డారు. ఆటోను ముజీబ్ దొంగిలించగా సులేమాన్‌ఫారం నడుపుతున్నారు. ఆటో చోరీపై బాధితులుు ఫిర్యాదు చేసినట్లు రుద్రూర్ పోలీసులు తెలిపారు. మృతదేహాలను బాన్సువాడ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి