AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మంత్రులు కాకుండానే పార్లమెంట్ భాద్యత‌లు.. వారికి కేబినెట్ బెర్త్ ఖ‌రారు అయిన‌ట్లేనా..?

కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం నియ‌మించిన పార్లమెంట్ ఇంచార్జీల వ్యవ‌హ‌రం ఇప్పుడు పార్టీలో సంచలనంగా మారింది. తెలంగాణకు సంబందించిన అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల‌కు మంత్రుల‌ను ఇంచార్జ్‌లుగా నియ‌మించ‌గా, కేవ‌లం జ‌హీరాబాద్, నిజామాబాద్ లోక్‌సభ స్థానాల‌కు మాత్రం సీనియ‌ర్ నేత‌లు, ఎమ్మెల్సీ జీనవ్ రెడ్డి, బోద‌న్ ఎమ్మెల్యే సుద‌ర్శన్ రెడ్డిని నియ‌మించ‌డం ఇప్పుడు కొత్త టాక్‌కు తెర‌తీస్తుంది.

Telangana: మంత్రులు కాకుండానే పార్లమెంట్ భాద్యత‌లు.. వారికి కేబినెట్ బెర్త్ ఖ‌రారు అయిన‌ట్లేనా..?
Sudarshan Reddy, Jeevan Reddy
Prabhakar M
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Dec 19, 2023 | 8:16 PM

Share

సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే రెండు పార్లమెంట్ సెగ్మంట్లలో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీల నియామ‌కం కొత్త రాజకీయ చ‌ర్చకు దారి తీస్తోంది. రెండు పార్లమెంట్ స్థానాలకు ఇద్దరు సీనియ‌ర్లను నియ‌మించ‌డంతో ఇప్పుడు వారి ప్యూచ‌ర్‌పై ర‌క‌ర‌కాల ప్రచారం ఊపందుకుంది. 17 పార్లమెంట్ స్థానాల్లో 15 లోక్ సభ నియోజకవర్గాలకు మంత్రుల‌కు మత్రమే ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఈ రెండు స్థానాల్లో మాత్రం ఓ ఎమ్మెల్యేకు, ఒక ఎమ్మెల్సీకి అప్పగించడం కాంగ్రెస్ పార్టీలో హ‌ట్ టాఫిక్ గా మారింది.

కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం నియ‌మించిన పార్లమెంట్ ఇంచార్జీల వ్యవ‌హ‌రం ఇప్పుడు పార్టీలో సంచలనంగా మారింది. తెలంగాణకు సంబందించిన అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల‌కు మంత్రుల‌ను ఇంచార్జ్‌లుగా నియ‌మించ‌గా, కేవ‌లం జ‌హీరాబాద్, నిజామాబాద్ లోక్‌సభ స్థానాల‌కు మాత్రం సీనియ‌ర్ నేత‌లు, ఎమ్మెల్సీ జీనవ్ రెడ్డి, బోద‌న్ ఎమ్మెల్యే సుద‌ర్శన్ రెడ్డిని నియ‌మించ‌డం ఇప్పుడు కొత్త టాక్‌కు తెర‌తీస్తుంది. వీరిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో సీనియ‌ర్లుగా ఉండ‌టం, మాజీ మంత్రులు కావ‌డం ఇప్పుడు ఈ చ‌ర్చకు దారి తీసింది.

బోద‌న్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి గెలిచిన సుద‌ర్శన్ రెడ్డి మొద‌టి నుండి మంత్రి పదవి రేసులో ఉన్నారు. తాను గెలిస్తే మంత్రి ప‌ద‌వి ప‌క్కా అనే ధీమాతో ఉన్నారు. కానీ పార్టీ మాత్రం వెయిటింగ్ లిస్ట్ లో పెట్టింది. ఇప్పుడు స‌డెన్‌గా మంత్రుల‌ను నియ‌మంచిన పార్లమెంట్ సెగ్మెంట్‌కు ఇంచార్జ్ సుద‌ర్శన్ రెడ్డిని నియ‌మించ‌డంతో కొత్త కేబినెట్‌లో బెర్త్ పక్కా అయిన‌ట్లే అనే ప్రచారం జ‌రుగుతోంది. ఇక అటు జీవ‌న్ రెడ్డి సైతం జ‌గిత్యాల నుండి ఓడిపోయిన‌ప్పటికీ ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉండ‌టంతో మంత్రి ప‌దవి ప‌క్కా అనుకున్నారు. కీని ఇప్పుడు త‌న నియోజక‌వ‌ర్గం కూడా ఉన్న నిజామాబాద్ పార్లమెంట్‌కు అత‌న్ని ఇంచార్జ్‌గా నియమించ‌డంతో జీవ‌న్ రెడ్డికి కేబినెట్ బెర్త్ ప‌క్కా అయిందనే ప్రచారం జ‌రుగుతుంది.

జీవ‌న్ రెడ్డి లోక్‌సభ.. కేబినెట్ కా..?

ఇక గ‌త కొద్ది రోజులుగా ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి పార్లమెంట్‌కు పోటీ చేస్తారనే ప్రచారం జ‌రుగుతుంది. నిజామాబాద్ నుండి కాంగ్రెస్ లో బ‌ల‌మైన లీడ‌ర్లు ఎవ‌రు లేక‌పోవ‌డంతో జీవ‌న్ రెడ్డిని పార్లమెంట్ బ‌రిలో దింపుతారనే ప్రచారం జ‌రుగుతుంది. ఈ క్రమంలోనే తాజాగా అదే పార్లమెంట్ స్థానానికి జీవ‌న్ రెడ్డిని ఇంచార్జ్‌గా నియ‌మించ‌డంతో ఆ చ‌ర్చ ఇప్పుడు ఈ సైడ్ ట‌ర్న తీసుకుంది. జీవ‌న్ రెడ్డిని పార్లమెంట్‌కు పోటి చేపిస్తే, అన్ని నియోజ‌వ‌ర్గాల్లో ప‌ట్టు సారించవచ్చనే టాక్ వినిపిస్తుంది. దీంతో లోక్ సభ ఎన్నికల్లో గట్టి ఫైట్ ఇవ్వడం, గెల‌వ‌డం ఈజీ అవుతుందనే భావ‌నలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు పార్లమెంట్ ఇంచార్జ్ ఇచ్చారనే ప్రచారం బ‌లంగా జ‌రుగుతుంది. ఇక ఉమ్మడి జిల్లాతో పాటుగా రెండు పార్లమెంట్ సెగ్మెంట్లలో ఆ ఇద్దరి పేర్లు బ‌లంగా వినిపిస్తున్నాయి. వీరిని అధిష్ఠానం ఏ సీట్లలలో కూర్చో పెడుతుందో వేచి చూడాల్సిందే..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…