Hyderabad: తప్పుచేశావ్ చిట్టి.. లవర్ కోసం.. 16 ఏళ్ల నుంచి కలిసి ఉంటున్న భర్తను…
సరూర్‌నగర్‌లో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం కోసం భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. నిద్రలోనే గొంతు నులిమి, డంబెల్‌తో తలపై కొట్టి చంపారు. ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి .. ...

భార్య భర్తను చంపడం.. భర్త భార్యను చంపడం వంటి ఘటనలు ఈ మధ్య పెరిగిపోతున్నాయ్. ఇందుకు ఇల్లీగల్ ఎఫైర్స్ మెయిన్ రీజన్స్‌గా ఉంటున్నాయ్. తాజాగా అలాంటి ఘటనే మరొకటి.. సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిల్‌సుఖ్‌నగర్ కోదండరామనగర్‌లో నివాసం ఉంటున్న శేఖర్, చిట్టికి 16 ఏళ్ల క్రితం వివాహం అయింది. వీర సొంతూరు నాగర్‌కర్నూల్. శేఖర్ క్యాబ్ డ్రైవరు కావడంతో… నగరంలో అయితే పని బాగా దొరకుతుందని ఫ్యామిలీని ఇక్కడికి ఫిష్ట్ చేశాడు. దంపతులకు ఒక అబ్బాయి, అమ్మాయి సంతానం. అయితే ఇటీవలి కాలంలో చిట్టి దారి తప్పింది. ఆమెకు హరీశ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి.. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. విషయం తెలియడంతో.. పద్దతి మార్చుకోవాలని భర్త పలుమార్లు హెచ్చరించాడు. అయితే ఆమె తన సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను లేపేయ్యాలని డిసైడయ్యింది.
గురువారం పిల్లలు ఇంట్లో లేని సమయాన్ని భర్త హత్యకు అనువుగా భావించింది చిట్టి. రాత్రి శేఖర్ నిద్రపోయిన తర్వాత.. ప్రియుడిని ఇంటికి పిలిపించింది. నిద్రలో ఉన్న శేఖర్‌ను.. హరీశ్ గొంతు నులమగా… చిట్టి డంబెల్‌తో తలపై కొట్టడంతో స్పాట్‌లోనే చనిపోయాడు. శుక్రవారం మధ్యాహ్నం స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం చేసేందుకు గాంధీ ఆసుపత్రికి తరలించారు. తదుపరి దర్యాప్తు జరుగుతుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




