GHMC Mayor Frock Special: జీహెచ్ఎంసీ మేయర్ గౌను కుట్టేది ఎవరో తెలుసా ? అతని ప్రత్యేకత ఎంటీ ?
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కొత్త కౌన్సిల్ ఏర్పడింది. అందుకు కొత్త మేయర్ మరియు డిప్యూటీ మేయర్ కూడా ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కొత్త కౌన్సిల్ ఏర్పడింది. అందుకు కొత్త మేయర్ మరియు డిప్యూటీ మేయర్ కూడా ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్ మేయర్ కౌన్సిల్ సమావేశంలో మేయర్ ధరించే గౌనుకు ఓ ప్రత్యేకత ఉంది.
దశాబ్దల నుంచి మేయర్లకు గౌన్ కుట్టడంలో బీఎస్ దాస్ ట్రైలర్ ప్రవీణ్ కుమార్ బాహెతి ఒక్కడే. 1999 నుంచి ఇప్పటి వరకు ఈ గౌన్లను తీర్చిదిద్దడంలో అతనికి అతనే సాటి. కోఠీ బడీచౌడీ ప్రాంతంలోని బీఎన్ దాస్ ట్రైలర్ ప్రవీణ్ కుమార్ బాహెతి మేయర్లకు గౌన్ కుడతాడు. 1999 లీజ్ జుల్ఫికర్ అలీ మేయర్ అయిననాటి నుంచి ప్రత్యేక గౌన్లను కుట్టడం ప్రారంభించారు. అనంతరం తీగల కృష్ణారెడ్డి, బండకార్తీక, మాజీద్ హుస్సెన్, బొంతు రామ్మోహన్ల నుంచి తాజాగా మేయర్గా ఎన్నికైన గద్వాల విజయలక్ష్మి వరకు ఆ గౌన్లను కుట్టి రికార్డు సొంతం చేసుకున్నాడు బాహెతి. ఆయన తీర్చిదిద్దే గౌన్లకు నాణ్యమైన మ్యాట్రిఫ్యాబ్రిక్స్, గోల్డెన్ లేస్లను ఉపయోగిస్తాడు. వీటి ధర రూ.10 వేల నుంచి రూ.60 వేల వరకు ఉంటుందని ప్రవీణ్ బాహెతి తెలిపారు. అంతేకాకుండా న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్స్, అన్ని విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్లర్లకు, నల్సార్ కాన్వకేషన్లకు ప్రత్యేక గౌన్లకు కుట్టడంలో బాహెతి మేటి. 1935లో టైలర్ షాప్ స్థాపించిన తాత బన్సీలాల్ నారాయణ దాస్, తండ్రి ద్వారా నేర్చుకున్నట్లు చెప్పారు.
Also Read: