Singareni Job Notification : సింగరేణి కొలువులకు భారీగా పోటీ.. పరీక్షల్లో ఎక్కువగా వీటిపైనే ప్రశ్నలు..!

తెలంగాణ సింగరేణి కొలువుల జాతరకు భారీగా పోటీ పెరిగింది. ఒకేసారి ఇంటర్నల్‌లో ఇతరులకు వేరువేరుగా నోటిఫికేషన్‌ జారీ చేయడంతో అర్హులైన అభ్యర్థులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

Singareni Job Notification : సింగరేణి కొలువులకు భారీగా పోటీ.. పరీక్షల్లో ఎక్కువగా వీటిపైనే ప్రశ్నలు..!
Singareni
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 12, 2021 | 10:05 AM

Singareni Job Notification : తెలంగాణ సింగరేణి కొలువుల జాతరకు భారీగా పోటీ పెరిగింది. ఒకేసారి ఇంటర్నల్‌లో ఇతరులకు వేరువేరుగా నోటిఫికేషన్‌ జారీ చేయడంతో అర్హులైన అభ్యర్థులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దేశంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థల్లో ఒకటైన సింగరేణి వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 372 ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సింగరేణి అంతర్గత అభ్యర్థులకు 879 ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ నెల 1న ప్రకటన విడుదల చేసింది. మొత్తం 1,251 ఖాళీలు ఉన్నాయి.

ఖాళీల భర్తీకి సింగరేణి విడుదల చేసిన నోటిఫికేషన్‌లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్య ఆధారంగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. విద్యార్హతల ఆధారంగా నిర్వహించే పరీక్షల్లో ఎక్కువగా మెంటల్‌ ఎబిలిటీతో పాటు వర్తమాన విషయాలపై ఎక్కువగా ప్రశ్నలు ఉండే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.

సింగరేణిలో ఉద్యోగాలు దక్కించుకోవడానికి అభ్యర్థులు కసరత్తు చేస్తున్నారు. శిక్షణ కేంద్రాల్లో రాత పరీక్షలకు అవసరమైన మెటీరియల్‌ను సిద్ధం చేసుకుంటున్నారు. సింగరేణిలో ఉద్యోగ భద్రత ఉండటంతో కష్టపడి ఉద్యోగం దక్కించుకోవడానికి మరింత కష్టపడుతున్నారు. ఇప్పటికే సింగరేణికి బయటి వారి నుంచి పది వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. అంతర్గత అభ్యర్థుల నుంచి కూడా పోటీ ఉండటంతో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు సింగరేణి సమాయత్తమవుతోంది.

మొత్తం పోస్టులు: 372 ఫిట్టర్‌- 128                                        (లోకల్ 105, జనరల్ 23) ఎలక్ట్రిషియన్- 51                            (లోకల్ 43, జనరల్ 8) వెల్డర్‌-54                                           (లోకల్‌ 44, జనరల్‌10) టర్నర్‌ లేదా మెషినిస్ట్‌ ట్రైనీ- 22 (లోకల్‌ 18, జనరల్‌ 4) మోటార్‌ మెకానిక్‌ ట్రైనీ-14            (లోకల్‌ 12, జనరల్‌ 2) ఫౌండర్‌ మెన్‌/మౌల్డర్‌ ట్రైనీ-19  (లోకల్‌ 16, జనరల్‌ 3) జూనియర్‌ స్టాఫ్‌ నర్స్‌-84             (లోకల్‌ 67, జనరల్‌ 17)

ఇవి కూడా చదవండి :

Anasuya : పోస్టల్ స్టాంప్‌పై అన‌సూయ ఫొటో.. ఆశ్చర్యపోతున్న అభిమానులు.. కారణాలు ఇలా ఉన్నాయి..

Army Recruitment 2021: ఇండియన్ ఆర్మీ సిపాయి రిక్రూట్‌మెంట్ ర్యాలీ.. డి.ఫార్మా, బి.ఫార్మా అర్హతతో నోటిఫికేషన్..

Kotia border dispute : మరోసారి ఏపీ, ఒడిశా మధ్య సరిహద్దు రచ్చ.. సుప్రీం కోర్టులో ఇవాళ విచారణకు రానున్న కొటియాల వివాదం