Army Recruitment 2021: ఇండియన్ ఆర్మీ సిపాయి రిక్రూట్‌మెంట్ ర్యాలీ.. డి.ఫార్మా, బి.ఫార్మా అర్హతతో నోటిఫికేషన్..

Army Sepoy Recruitment: ఆర్మీలో సిపాయి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు సిపాయి నియామక ర్యాలీకి డి.ఫార్మా, బి.ఫార్మా..

Army Recruitment 2021: ఇండియన్ ఆర్మీ సిపాయి రిక్రూట్‌మెంట్ ర్యాలీ.. డి.ఫార్మా, బి.ఫార్మా అర్హతతో నోటిఫికేషన్..
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 11, 2021 | 12:01 PM

Army Sepoy Recruitment: ఆర్మీలో సిపాయి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు సిపాయి నియామక ర్యాలీకి డి.ఫార్మా, బి.ఫార్మా అర్హతగల పురుష అభ్యర్థుల నుంచి భారత సైన్యం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు పలుచోట్ల రిక్రూట్‌మెంట్ ర్యాలీలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. కనీసం 55% మార్కులతో డి.ఫార్మా, బి.ఫార్మా పాస్ అయి స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ లేదా ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులంటూ నోటిఫికేషన్‌లో వెల్లడించింది. సీవోబీఎస్ఈ, ఏఐసీటీఈ, సీబీఎస్ఈ, ఎన్ఐఓఎస్ అనుబంధంగా ఉన్న విద్యా బోర్డులు జారీ చేసిన ధృవీకరణ పత్రాలు మాత్రమే పరిగణలోకి తీసుకోనున్నట్లు వెల్లడించింది.

అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు.. దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 19-25 సంవత్సరాల మధ్య ఉండాలి. వైద్యపరంగా ఆరోగ్యంగా ఉన్న అభ్యర్థులకు సాధారణ ప్రవేశ పరీక్ష కోసం ర్యాలీ సైట్‌లో అడ్మిట్ కార్డులు జారీ చేస్తారు. ఈ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు కొనసాగనుంది. ఈ ర్యాలీను రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో నిర్వహించనున్నారు. మరిన్ని వివరాల కోసం.. ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్‌సైట్‌ indianarmy.nic.in ను చూడండి.

Also Read:

UPSC Exam 2021: సివిల్స్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష తేదీ ఖరారు.. ప్రకటన విడుదల చేసిన యూపీఎస్సీ..

PM Modi Emotional Video: రాజ్యసభలో మోడీ కన్నీరు..గులాం నబీ ఆజాద్‌ కోసం ఉద్వేగానికి గురైన మోడీ.