రికార్డు స్థాయి ధరల నుంచి దిగివస్తున్న పసిడి ధరలు.. ఈ సమయంలో బంగారం కొనోచ్చా ? నిపుణుల ఏం చెబుతున్నారంటే..
కరోనా నేపథ్యంలో గతేడాదిలో బంగారం ధరలు రికార్డు సాయిని నమోదు చేసుకున్నాయి. ఇటీవల కొన్ని రోజుల నుంచి పసిడి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఇదిలా ఉండగా..
కరోనా నేపథ్యంలో గతేడాదిలో బంగారం ధరలు రికార్డు సాయిని నమోదు చేసుకున్నాయి. ఇటీవల కొన్ని రోజుల నుంచి పసిడి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ప్రపంచ రేట్ల సానుకూలంగా అంతర్జాతీయ మార్కెట్‌తో పోల్చుకుంటే.. బుధవారం దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు వరుసగా నాలుగో రోజు పెరిగాయి. అటు MCXలో గోల్డ్ ఏప్రిల్ నెలలో రూ.122 లేదా 0.25 శాతం పెరిగి 10 గ్రాములకు రూ.48,070 వరకు పెరిగింది. ఇక వెండి మార్చిలో కిలోకు రూ.69,850, రూ.154 లేదా రూ.0.22 శాతం పెరిగింది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది ప్రారంభం నుంచి, గతేడాది ఆగస్టులో 10 గ్రాముల బంగారం ధర 10 గ్రాముల పుత్తడి ధర రూ.56,196 రూపాయల గరిష్ట స్థాయిని తాకింది. ఇక ఆ తర్వాత గ్లోబల్ మార్కెట్లలో డాలర్ రేటు పడిపోవడంతోపాటు, అమెరికాలో భారీ ఉద్దీపన ప్యాకేజీ యొక్క అంచనాలు బులియన్ అప్పిళ్ళను ఎత్తివేశాయి. ఇక స్పాట్ బంగారం ధర ఔన్స్‌కు 0.2 శాతం పెరిగి 1,839.99 డాలర్లకు చేరుకుంది. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయి నుంచి 8000 తగ్గింది. దీంతో అమెరికా ఫ్యూచర్స్ 0.2 శాతం పెరిగి 1,840.40 డాలర్లకు చేరుకుంది.
ట్రేడ్ బుల్స్ సెక్యూరిటీస్ సంస్థ సీనియర్ టెక్నీకల్ రీసెర్చ్ ఎనలిస్ట్ భావిక్ పటేల్ ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ మాట్లాడుతూ.. బంగారం ధరలు దాదాపు డిసెంబర్లో ఏర్పడిన లాభాలన్నింటిని కనుమరుగు చేసిందని తెలిపారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొవిడ్ ఉపశమన బిల్లును ఉన్న మొదటి ముసాయిదాను డెమోక్రాట్స్ విడుదల చేసిన తర్వాత బంగారం ధరలు దిగివస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంబంలో చైనాలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. బంగారం, వెండిల కోసం కొన్ని శుద్ధి కర్మాగారాలు మరియు బల్క్ సరఫరాదారుల నుంచి ప్రీమియం పెరుగుతున్నట్లుగా పటేల్ తెలిపారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల పసిడి ధర రూ.44,750గా కొనసాగుతుంది. ఇక రానున్న రోజుల్లో బంగారం ధరలు పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో బంగారం కోనాలనుకునే వారికి ఇది ఒకరకంగా చెదు వార్త అనే చెప్పుకోవాలి. నిపుణుల అంచనాల ప్రకారం బంగారం, వెండి ధరలు తగ్గే అవకాశాలు లేకపోలేదు.
Also Read: