బరువు తగ్గడానికి తక్కువగా తింటున్నారా ? అయితే ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే..
ఉద్యోగ జీవితంలో ఎక్కువగా కూర్చోవడం.. శరీరానికి శ్రమ కలిగించకుండా.. మెదడు మాత్రమే శ్రమ కలిగించడం.. సరైన సమయానికి తినకపోవడం.. మంచి
ఉద్యోగ జీవితంలో ఎక్కువగా కూర్చోవడం.. శరీరానికి శ్రమ కలిగించకుండా.. మెదడు మాత్రమే శ్రమ కలిగించడం.. సరైన సమయానికి తినకపోవడం.. మంచి ఆహారాన్ని తీసుకోకపోడం ఇలా ఏదో ఒక రకంగా బరువు పెరుగడానికి కారణామవుతుంటాయి. చాలా మంది బరువు తగ్గడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఆహారం మానేయడం, ట్యాబ్లెట్స్ వాడడం లేదా ట్రీట్ మెంట్స్ తీసుకోవడం వంటివి చేస్తుంటారు.
బరువు తగ్గాలి అంటే తక్కువగా తినాలి అనుకుంటుంటారు. శరీరంలోని కేలరీలను బర్న్ చేయడం వలన బరువు తగ్గే అవకాశం ఉంది. మీరు ఎంత తక్కువ తింటున్నారో.. మీ బాడీ స్టోర్స్ ఎక్కువగా ఉంటాయని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ పూజా మఖిజా తన ఇటీవల ఇన్స్టాలో షేర్ చేశారు.
తక్కువగా తింటే బరువు తగ్గుతారా ? సాధరణంగా తక్కువగా తినడం వలన శరీరంలో ఎక్కువగా నిల్వ చేస్తుందని మఖితా తన వీడియోలో చెప్పుకోచ్చింది. శరీరానికి కావాల్సిన దానికంటే తక్కువగా తినడం వలన జీవక్రియ రేటు తగ్గుతుందని.. ఇది సూపర్ ఇంటెలిజెంట్ మెకానిజంలో పనిచేస్తుందని తెలిపారు. ఆకలి వేసినప్పుడు రోజూలో కొంచం కేలరీలు ఉన్న ఫుడ్ తినడం వలన బాడీకి కావాల్సిన పోషకపదార్థాలను తినడం మంచిది. పోషకాహరం తినడం వలన శరీరానికి కావాల్సిన ఇమ్యూనిటీ పవర్, ఆరోగ్యకరమైన జుట్టు, కాంతివంతమైన చర్మం, రోగనిరోధక శక్తితోపాటు శరీర బరువును కూడా సరైన క్రమంలో ఉంటాయి.
మంచి ఆరోగ్యం కోసం శరీరానికి అవసరమైన ఆహారాన్ని సాధ్యమైనన్ని తినడమనేది చాలా ముఖ్యమని ముంబైకి చెందిన పోషకాహార నిపుణుడు చెప్పారు. ఆకలిగా ఉన్నప్పుడు ఆశ్రద్ద చేయకుండా ఏదైనా ఆహారాన్ని తింటూ ఉండాలి. అలాగే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడంపైన దృష్టి పెట్టాలి. ఇందులో భాగంగా ఇంట్లో వండిన వంటకాలు, పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలు, విత్తనాలు, గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులు తినడం అలవాటు చేసుకోవాలి.
బరువు తగ్గాలనుకునే వారు మంచి కొవ్వులు, ప్రొటీన్లు మరియు పిండి పదార్థాల వంటి ఆహారం తీసుకోవడం ఉత్తమం. శరీరంలో కేలరీలు తగ్గకుండా చూసుకోవడం వలన బరువు పెరగకుండా ఉంటారు. అలాగే ఆకలిగా ఉన్నప్పుడు తినకుండా ఉండడం, సరైన సమయానికి తినకపోవడం వలన శరీరంలో కొవ్వు పెరిగి… బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే రోజు వ్యాయమం చేయడం వలన శారీరకంగా చురుకుగా ఉంటారు. మెదడుపై ఒత్తడిని తగ్గించడం, అలాగే సరిగ్గా నిద్రపోవడం వలన బరువు తగ్గుతారు.
Also Read: Health News: అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా? ఈ ఆహార పద్ధతులు పాటిస్తే ఫలితం పక్కా.