AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kotia border dispute : మరోసారి ఏపీ, ఒడిశా మధ్య సరిహద్దు రచ్చ.. సుప్రీం కోర్టులో ఇవాళ విచారణకు రానున్న కొటియాల వివాదం

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు రాజేశాయి. కొటియా ప్రాంతంలో ఏపీ ఎలా ఎన్నికలు నిర్వహిస్తుంది అంటూ ఒడిశా ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. మరి ఇవాళ సుప్రీం ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.

Kotia border dispute : మరోసారి ఏపీ, ఒడిశా మధ్య సరిహద్దు రచ్చ.. సుప్రీం కోర్టులో ఇవాళ విచారణకు రానున్న కొటియాల వివాదం
AoB dispute
Sanjay Kasula
|

Updated on: Feb 12, 2021 | 8:05 AM

Share

Kotia border dispute : ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు రాజేశాయి. కొటియా ప్రాంతంలో ఏపీ ఎలా ఎన్నికలు నిర్వహిస్తుంది అంటూ ఒడిశా ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. ఏపీ అధికారులు మాత్రం అవి తమ భూబాగంలోని గ్రామాలే అని.. మన సంక్షేమ పథకాలే అక్కడ అమలవుతున్నాయి అంటున్నారు.. మరి ఇవాళ సుప్రీం ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు రాజేశాయి. ఇందుకు కారణం రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న కొటియా ప్రాంతం. విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని పట్టుచెన్నేరు, పగులుచెన్నేరు, కురుకూటి, గంజాయిభద్ర, సారిక పంచాయతీల్లో 23 గిరిశిఖర గ్రామాలున్నాయి. వీటిని కొటియా పల్లెలుగా అక్కడివారు పిలుస్తుంటారు. ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి కొత్త సమస్య వచ్చిపడింది. సరిహద్దు రచ్చ మొదలైంది. గ్రామాల మధ్య కాదు.. రెండు రాష్ట్రాల మధ్య కాదు.  ఏపీ ఎస్ఈసీ ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్‌ను ఒడిశా ప్రభుత్వం మాత్రం ఒప్పుకోవడం లేదు. కొటియా ప్రాంతం తమది అంటోంది. ఏపీ పంచాయతీ ఎన్నికలపై నేరుగా సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

తమ భూభాగంలో ఉన్న మూడు ప్రధాన పంచాయతీల పేరు మార్చి ఏపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తోందని ఒడిశా ప్రభుత్వం ఆరోపిస్తోంది. సరిహద్దు గ్రామాల విషయంలో ఆంధ్ర ప్రదేశ్ కోర్టు ధిక్కరణకు పాల్పడిందని ఆరోపిస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. గంజాయ్ పదర్ ను గంజాయిభద్రగా, పట్టుసెనరీని పట్టు చెన్నూరుగా, ఫగలుసెనరీని పగులచెన్నేరుగా పేర్లు మార్చి ఏపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తోందని.. వాటికి సంబంధించి ఆధారాలు కూడా తమ దగ్గర ఉన్నాయంటూ ఫిటిషన్‌లో పేర్కొంది.

మూడు పంచాయతీల్లో ఎన్నికలు ఏకగ్రీవం చేసి.. పగులుచెన్నేరులో మాత్రం ఎన్నిక నిర్వహిస్తోన్నట్టు పిటిషన్‌లో స్పష్టం చేసింది. దీనిపై ఏపీ ఎన్నికల కమిషనర్, సీఎస్‌ల నుంచి సంజాయిషీ కోరాలని విజ్ఞ‌ప్తి చేసింది. కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఏపీ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని ఒడిశా ప్రభుత్వం కోరింది..

ఏపీ ప్రజా ప్రతినిధుల వెర్షన్ వేరేలా ఉంది. కొటియా పల్లెలు అపార ఖనిజ సంపదకు నిలయాలని. అక్కడి కొండల్లో అధికంగా మాంగనీస్, ఇనుప ఖనిజం, రంగురాళ్లు వంటి విలువైన నిక్షేపాలున్నాయని. వీటి విలువ కొన్ని లక్షల కోట్లల్లో ఉంటుందంటున్నారు. అందుకే వాటిని దక్కించుకునేందుకు ఒడిశా ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతానికి సంబంధించిన వివాదాన్ని పార్లమెంటు కమిటీ అధ్యయనం చేస్తోంది. అధిక శాతం ప్రజల అభీష్టం మేరకే వారిని ఏ రాష్ట్రానికి ఇవ్వాలనే దానిపై పార్లమెంట్‌ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది అంటున్నారు.

గంజాయిభద్రలో మొత్తం 13 గ్రామాలున్నాయి. పట్టు చెన్నేరులో నాలుగు, పగులుచెన్నేరులోని మూడు, సారికలో ఒకటి, కురుకూటిలో రెండు పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ఘట్టం కూడా పూర్తయింది. లేటుగా స్పందించిన ఒడిశా ప్రభుత్వం ప్రస్తుతం అక్కడ పోలీసు బలగాలను దించింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రజలు ఎవరూ పాల్గోవద్దని అక్కడి ప్రజలకు సూచిస్తోంది. స్థానిక ప్రజలు కూడా రెండు వర్గాలు చీలి.. కొందరు ఒడిశాకు అనుకూలంగా మాట్లాడుతుంటే.. కొందరు ఏపీలో కొనసాగేందుకే ఇష్టపడుతున్నట్టు సమాచారం. మరి సుప్రీ కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి..

ఇవి కూడా చదవండి :

Anasuya : పోస్టల్ స్టాంప్‌పై అన‌సూయ ఫొటో.. ఆశ్చర్యపోతున్న అభిమానులు.. కారణాలు ఇలా ఉన్నాయి..

Army Recruitment 2021: ఇండియన్ ఆర్మీ సిపాయి రిక్రూట్‌మెంట్ ర్యాలీ.. డి.ఫార్మా, బి.ఫార్మా అర్హతతో నోటిఫికేషన్..