ముగిసిన గుణదలమాత మహోత్సవాలు.. ముగింపు ఉత్సవాలకు రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చిన అశేష భక్తజనం

ప్రతిష్టాత్మత విజయవాడ గుణదలమాత మేరీ మాత మహోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన మహోత్సవాల్లో

  • K Sammaiah
  • Publish Date - 8:02 am, Fri, 12 February 21
ముగిసిన గుణదలమాత మహోత్సవాలు.. ముగింపు ఉత్సవాలకు రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చిన అశేష భక్తజనం

ప్రతిష్టాత్మత విజయవాడ గుణదలమాత మేరీ మాత మహోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన మహోత్సవాల్లో రాష్ట్రవ్యాప్తంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్ -19 మహమ్మారితో మానవ జీవితం క్షణికమని , నీటి బుగ్గలాంటిదని తెలిసిపోయిందని విజయవాడ కతోలిక పీఠం బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు అన్నారు. ఆఖరి రోజు గుణదలమాత తిరునాళ్లకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన బిషప్ గ్రాసి హైస్కూల్ గ్రౌండ్ లో అశేషభక్త జనులకు వ్యాక్యోపదేశం చేస్తూ కరోనా నుంచి మానవుడు ఎన్నో గుణపాఠాలు నేర్చుకోవలసి వుందన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ధనవంతులు ఎంతోమంది కరోనాతో మృత్యువాత పడ్డారని , వారిని ఏ ధనమూ కాపాడలేకపోయిందన్నారు . కరోనా నేర్పిన గుణపాఠంతో మానవుడు పరివర్తన పొందాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు . దేవుడిపట్ల మానవులు భయం, భక్తులతో జీవించాలని అన్నారు. లక్షలాది మంది కరోనాతో మరణిస్తే కనీసం రక్తసంబంధీకులు అంత్యక్రియలు వెళ్ళలేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తంచేశారు. 1858 సంవత్సరంలో ఫ్రాన్సు దేశంలోని లూర్థునగర్ లో బెర్నెదత్ అనే బాలికకు 18 సార్లు లూర్థుమాత దర్శనమిచ్చిందన్నారు. గుణదలమాతను దర్శించుకొనే భక్తులు అనేకమంది అనేక మేలులు పొందుతూ సాక్ష్యంగా నిలుస్తున్నారని అన్నారు.

ప్రస్తుత పోప్ ఫ్రాన్సిస్ వారు పర్యావరణంపట్ల ఆందోళన వ్యక్తం చేశారని , ప్రకృతి పరిరక్షణకు అన్నిదేశాలు నడుం బిగించాలని పిలుపు నివ్వటం జరిగిందన్నారు . దేవుని అనుగ్రహాల వలన మరియమాత పాపాన్ని జయించారని తెలిపారు . అనంతరం బిషప్ గ్రాస్ హైస్కూల్ గ్రౌండ్ లోని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళావేదికపై బిషప్ జోసఫ్ రాజారావు , శ్రీకాకుళం మేత్రాసనం బిషప్ రాయరాల విజయకుమార్ , మోన్సిస్యోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్ , వికార్ జనరల్ ఫాదర్ యం, గాబ్రియేలు ,3 4 5 పుణ్యక్షేత్రం రెక్టర్ ఫాదర్ యేలేటి విలియం జయరాజు , ఎస్ఎస్ సి డైరెక్టర్ ఫాదర్ పసల థోమస్ , తదితర గురువులు సమష్టి దివ్యపూజాబలి సమర్పించారు.

పూజానంతరం బిషప్ రాజారావు తదితర గురువులు “ కతోలిక భక్తులకు దివ్యసత్రసాదం ” అందజేశారు . సెయింట్ ఆలోషియస్ సిస్టర్స్ , మదిరి బెర్నాడ్ ఆధ్వర్యంలో మేత్రాసన గాయక బృందం ఆలపించిన ఆరాధన గీతాలు భక్తులను ఆకట్టుకున్నాయి . ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ సి డైరెక్టర్ ఫాదర్ పసల థోమస్ , ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఫాదర్ కొలకాని మరియన్న , కరస్పాండెంట్ ఫాదర్ ఇంటి అంతోని తదితర గురువులు , సిస్టర్స్ , భక్తులు అశేష సంఖ్యలో పాల్గొన్నారు .

 

Read more:

సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినూత్న కార్యక్రమం.. లాంఛనంగా ప్రాంరంభించిన వినయ్‌భాస్కర్‌