AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఫిబ్రవరి 12 రాశిఫలాలు.. స్నేహితులతో కలహాలు ఏర్పడతాయి.. మరోక రాశివారు ఆర్థికంగా అభివృద్ధిలో..

మన దేశంలో రాశిఫలాలను చాలా మంది నమ్ముతుంటారు. ఈరోజు వారి స్థితి ఎలా ఉంటుందనేది తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తితో ఉంటారు. ఈ

Horoscope Today: ఫిబ్రవరి 12 రాశిఫలాలు.. స్నేహితులతో కలహాలు ఏర్పడతాయి.. మరోక రాశివారు ఆర్థికంగా అభివృద్ధిలో..
Rajitha Chanti
| Edited By: uppula Raju|

Updated on: Feb 13, 2021 | 7:53 AM

Share

మన దేశంలో రాశిఫలాలను చాలా మంది నమ్ముతుంటారు. ఈరోజు వారి స్థితి ఎలా ఉంటుందనేది తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తితో ఉంటారు. ఈ రోజు అంటే ఫిబ్రవరి 12 శుక్రవారం మేషం నుంచి మీనం వరకు మిగిలిన రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉండనుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి.. మేషరాశి వారు ఈరోజు ప్రముఖులతో పరిచయాలను ఏర్పాటు చేసుకుంటారు. చాలా జాగ్రాత్తగా వ్వవహరిస్తుండాలి. దుర్గ అమ్మవారికి ఎరుపు రంగులోని పుష్పాలు సమర్పణ చేయడం మంచిది. వృషభరాశి.. వృషభరాశి ఈరోజు ఆర్థిక విషయంలో పెద్దవారి సలహాలు తీసుకోవాలి. అలాగే అనవసరమైన కార్యక్రమాలు చేపట్టకూడదు. మహాలక్ష్మీ కుంకుమార్చన నిర్వహించడం మంచింది. మిధున రాశి.. మిధున రాశి వారు షేర్లు, పెట్టుబడులలో జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పులు ఇవ్వడం, తీసుకోవడం రెండు కూడా మంచిది కాదు. దుర్గ అమ్మావారికి కుంకుమ అర్చన చేయడం మంచింది. కర్కాటక రాశి.. కర్కాటక రాశి రావాల్సినటువంటి బాకీలు కొంత ఆలస్యమవుతుంటాయి. కమ్యూనికేషన్ రంగాలకు కొంత వరకు అనుకూలంగా ఉంటుంది. శ్రీవెంకటేశ్వర దర్శనం మేలు చేస్తుంది. సింహ రాశి.. సింహరాశి వారు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోని ఇబ్బందులు పడుతుంటారు. ఆందోళన, ఆరోపణలు పడుతుంటారు. నవగ్రహ స్తోత్ర పరాయణం మేలు చేస్తుంది. కన్యారాశి.. కన్యారాశి వ్యక్తిగతంగా ఇబ్బందులు పడుతుంటారు. ఎవరి వద్ద అయితే అప్పులు తీసుకుంటారో.. వారి నుంచి కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. తులరాశి.. తులరాశి స్నేహితులతో, బంధువులతో కొంత విరోధం లేదా అభిప్రాయా బేధాలు కలుగుతుంటాయి. శ్రమ అధికంగా ఉంటుంది. మహాలక్ష్మీ అమ్మవారికి గులాబీ పూవ్వులతో అర్చన నిర్వహించడం మంచింది. వృశ్చిక రాశి.. వృశ్చిక రాశి వారికి ఈరోజు రాబడి కంటే ఖర్చులు పెరుగుతుంది. మిశ్రమమైన ఫలితాలు ఉంటాయి. జాగ్రత్తలు తీసుకుంటుండాలి. పేదవారికి గోదుమలను ధానం చేయడం మంచింది. ధనుస్సు రాశి.. ధనుస్సు రాశి వారికి ఈరోజు చేపట్టినటువంటి కార్యక్రమాలు కొంత ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తుంటారు. ఆర్థికంగా అభివృద్ధికి సాధిస్తారు. పేదవారికి పాలు, పండ్లు ధానం చేయడం మంచింది. మకర రాశి.. మకర రాశి వారు ఈరోజు చేపట్టిన పనిలో తొందరపడుతుంటారు. అందివచ్చిన అవకాశాలను జారవిడుచుకునే ప్రయత్నంలో ఉంటారు.. అందుకని జాగ్రత్తలు తీసుకోవాలి. దేవి ఖడ్గమాల స్తోత్రం మేలు చేస్తుంది. కుంభ రాశి.. కుంభరాశి వారికి ఈరోజు ముఖ్యమైనటువంటి వార్తలు అందుతుంటాయి. ప్రయణాలు చేస్తుంటారు. ఆర్థిక లాభాలు పొందుతుంటారు. అష్టలక్ష్మి స్తోత్రం మంచింది. మీన రాశి.. మీన రాశి వారికి ఈరోజు ప్రయాణకరంగా కొన్ని ఖర్చులను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. తొందపడి చేపట్టినటువంటి కార్యక్రామలు అనుకున్నటువంటి ప్రయోజనాలు అందించలేవు. పరమేశ్వరుని ఆరాధన మంచింది.

Also Read:

Mauni Amavasya 2021: మౌని అమావాస్య అంటే ఏమిటి ? ఆ రోజున చేయవలసిన పనుల గురించి పూర్తి వివరాలు..