Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mauni Amavasya 2021: మౌని అమావాస్య అంటే ఏమిటి ? ఆ రోజున చేయవలసిన పనుల గురించి పూర్తి వివరాలు..

హిందూ క్యాలెండర్‏లో అత్యంత పవిత్రమైన రోజులలో ఈ మౌని అమావాస్య ఒకటి. దీనిని మాఘీ అమావాస్య అని కూడా అంటారు. 'మౌని' అనేది సంస్కృత పదం.

Mauni Amavasya 2021: మౌని అమావాస్య అంటే ఏమిటి ? ఆ రోజున చేయవలసిన పనుల గురించి పూర్తి వివరాలు..
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 11, 2021 | 1:29 PM

Mauni Amavasya 2021 Significance: హిందూ క్యాలెండర్‏లో అత్యంత పవిత్రమైన రోజులలో ఈ మౌని అమావాస్య ఒకటి. దీనిని మాఘీ అమావాస్య అని కూడా అంటారు. ‘మౌని’ అనేది సంస్కృత పదం. ‘మౌన్’ నుంచి మౌని అనే పదం వచ్చింది. మౌని అంటే అర్థం ‘సంపూర్ణ నిశ్సబ్దం’. అందుకే ఈరోజున పూజలు చేసేవారంత మౌనవ్రతం చేస్తారు. గంగానది నీరు మౌని అమావాస్య నాడు అమృతంగా మారుతుందని నమ్ముతారు. దీనివల్ల ఆరోజు స్నానం చేయటానికి గంగానది ముఖ్యమైన నదిగా మారింది.

పవిత్ర నగరాలైన హరిద్వార్, ప్రయాగ్రాజ్ మరియు గంగా నదులలో ఈరోజున వేలాది మంది భక్తులు వచ్చి స్నానమాచరిస్తారు. కేవలం మౌనీ అమావాస్య రోజు మాత్రమే కాకుండా ఈ నెల మొత్తాన్ని అత్యంత పవిత్ర మాసంగా భావిస్తారు. పుష్య పూర్ణిమ రోజు మొదలు పెట్టి మాఘ పూర్ణిమ వరకు వ్రతాన్ని పూర్తి చేస్తారు. ఈ రోజు చాలా పవిత్రం.

మౌని అమావాస్య ముహుర్తం.. అమావాస్య తిథి ఈ రోజు తెల్లవారు జామున 1.08 గంటలకగు ప్రారంభమైంది. అమావాస్య రేపు, ఫిబ్రవరి 12 ఉదయం 12.35కు ముగుస్తుంది.

మౌని అమావాస్య ప్రాముఖ్యత.. మౌని అమావాస్యను మౌనంగా ఉండే అమావాస్య అని కూడా అంటారు. ఈరోజు, సాధువులు మౌనంగా ఉంటారు. దీన్ని జ్ఞానంను నిద్రలేపే చర్యగా భావించి, దానికోసం మాటలు అవసరం లేదని భావిస్తారు. ఏమీ చెప్పవలసిన అవసరం కానీ, చెప్పగలిగేందుకు కూడా ఏమీ ఉండదని నమ్ముతారు. గంగానది నీరు మౌని అమావాస్య నాడు అమృతంగా మారుతుందని నమ్ముతారు. దీనివల్ల ఆరోజు స్నానం చేయటానికి గంగానది ముఖ్యమైన నదిగా మారింది. గంగానదిలో స్నానం చేయటానికి కూడా మౌని అమావాస్య కూడా మేటి రోజు. కొంతమంది భక్తులు మాఘమాసం మొత్తం గంగానదిలో స్నానం చేయాలని వ్రతం చేపడతారు. వారు పుష్య పూర్ణిమ నాడు మొదలుపెట్టి, మాఘ పూర్ణిమ నాడు వ్రతాన్ని పూర్తి చేస్తారు. మౌని అమావాస్య రోజును మాఘి అమావాస్య అని కూడా అంటారు.ఇది హిందూ క్యాలెండర్‏లో మాఘమాసంలో వస్తుంది. హరిద్వార్ కుంభమేళా 2021: గంగా స్నానం చేయడానికి ముఖ్య తేదీలు.. 14 జనవరి, గురువారం: మకర సంక్రాంతి 11 ఫిబ్రవరి, గురువారం: మౌని అమావాస్య 16 ఫిబ్రవరి, మంగళవారం: బసంత్ పంచమి 27 ఫిబ్రవరి, శనివారం: మాఘ పూర్ణిమ 11 మార్చి, గురువారం మహాశివరాత్రి – మొదటి షాహి స్నానం 12 ఏప్రిల్, సోమవారం: సోమవతి అమవస్య – రెండవ షాహి స్నానం 13 ఏప్రిల్ , మంగళవారం: చైత్ర శుక్ల ప్రతిపాద 14 ఏప్రిల్, బుధవారం: బైషాకి – మూడవ షాహి స్నానం 21 ఏప్రిల్, బుధవారం: రామ నవమి 27 ఏప్రిల్, మంగళవారం: చైత్ర పూర్ణిమ – నాల్గవ షాహి స్నానం

మౌని అమావాస్య ఆధ్యాత్మిక విశిష్టత…

మౌని అమావాస్య పదాల్లో ఉన్న ఆధ్యాత్మిక తత్వం చాలా గొప్పది. మౌని అమావాస్య పదాలను మౌని, అమా మరియు వాస్యగా విడగొట్టవచ్చు. మౌని అంటే అర్ధం మాట్లాడకుండా మౌనంగా ఉండటం అని అర్థం.  అమ అంటే చీకటి అని అర్థం. అలాగే వాస్య  అంటే కామం. అమావాస్యకి మరో అర్థం కలిసి వెతకడం. దీని అర్థం పగటిపూట మౌనంగా ఉండి చీకటిని, కామాన్ని తొలగించుకోవాలనేది. చందమామ మన మనస్సులను నియంత్రించే గ్రహమని నమ్ముతుంటారు. మౌని అమావాస్య నాడు చంద్రుడు మనకు కనిపించడు. ఈ రోజు మాట్లాడే మాటలు, తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను కలిగించవు అని అంటుంటారు.  శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు “మన మనస్సే మనకి గొప్ప స్నేహితుడు, అందుకని దానికి సరిగ్గా శిక్షణనిస్తే నియంత్రణలో ఉంటుంది. దానికి మీమీద నియంత్రణనిస్తే అదే గొప్ప శత్రువుగా మారవచ్చు.” శరీరాన్ని,  మనస్సును, ఆత్మను శుద్ధిచేసుకోవడానికి పవిత్రనదుల్లో స్నానం చేయడం, మౌనంగా ఉండాలనేది ఈ అమావాస్య ప్రతితి.

మౌని అమావాస్యను జరుపుకునే విధానం.. 

సాధరణంగా చాలా మంది ఈ మౌని అమావాస్య రోజున ఉపవాసం ఉంటారు. మౌనవ్రతం చేస్తారు, ఒక్క మాట కూడా మాట్లాడకుండా జాగ్రత్తపడతారు. గంగానదిలో స్నానం తప్పనిసరని భావిస్తుంటారు. ఒకవేళ సాంప్రదాయకంగా మౌని అమావాస్యను జరుపుకోలేని వారు కింద చెప్పినట్లుగా ఆచారిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు.

గంగానదిలో స్నానం చేయలేయడానికి వీలు లేనివారు ఇంట్లో కొన్ని గంగానది నీళ్ళు  ఉంటే ..  కొన్ని చుక్కలను స్నానం చేసే నీళ్ళకి కలుపుకోండి.  స్నానం చేసే ముందు ఈ మంత్రాన్ని “గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి, నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధుం కురు” ఉచ్చరిస్తే గంగానదిలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది.

పితృపూజ..

పితృపూజ చేయటానికి మౌని అమావాస్య మంచిరోజు. ఈరోజు మీరు మీ పూర్వీకులను గుర్తు చేసుకుని, వారి జ్ఞాపకాలను గౌరవిస్తూ, వారి ఆశీస్సులు పొందుతారు.

ధ్యానం…

ధ్యానం చేయడమనేది చాలా మంచి ప్రక్రియ. అలాగే మంతాలను ఉఛ్చారించడం, సంగీతం వినడం వలన మనసు శాంతిగా ఉంటుంది.

రుద్రాక్షలు..

చంద్రుడితో సంబంధం ఉన్నందున రుద్రాక్షమాలను ఈరోజు మీరు ధరించవచ్చు. కాకపోతే రుద్రాక్షలు ద్విముఖి లేదా పదహారు ముఖి అయివుండాలి. ఇవి వేసుకున్నవారికి ఆందోళన తగ్గి ప్రశాంతత ఏర్పడుతుంది.

శనీశ్వరుడు..

మౌని అమావాస్య నాడు శనీశ్వరుడిని కూడా పూజిస్తారు.  నువ్వులు లేదా తిల్ నూనెతో ఈ రోజు శనీశ్వరుడికి అభిషేకం చేస్తారు.

Also Read:

Kumbha Masa Pooja : శబరిమలలో భక్తుల ప్రవేశంపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం..