AP Panchayat Elections 2021: ఓటర్ స్లిప్ రానివారు ఇలా చేయండి.. డిజిటల్ ఓటర్ ఐడీ డౌన్‌లోడ్ చేసుకోండి
మీ ఓటర్ స్లిప్ ఇంకా రాకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓటర్ స్లిప్‌ను సులభంగా మీ కంప్యూటర్ లేదా మొబైల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయడానికి సిద్ధమయ్యారా. ఇప్పటికే మీ చేతికి ఓటర్ స్లిప్‌లు వచ్చుంటాయి. ఒక వేళ మీ ఓటర్ స్లిప్ ఇంకా రాకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓటర్ స్లిప్‌ను సులభంగా మీ కంప్యూటర్ లేదా మొబైల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎలా అంటారా.. ఇ-ఎలక్ట్రానిక్ ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ e-EPIC అంటే డిజిటల్ ఓటర్ ఐడీ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఓసారి చూద్దాం…
- ఓటర్ స్లిప్ కోసం ముందుగా కంప్యూటర్ లేదా మొబైల్ బ్రౌజర్‌లోకి వెళ్లి voterslipulb.apec.gov.in అని టైప్ చేయండి. ఎన్నికలకు సంబంధించి వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జిల్లా, అర్బన్/లోకల్ బాడీ అనే సెక్షన్స్ ఉంటాయి. తర్వాతి సెక్షన్‌లో మీ వార్డ్ నంబర్ సెలెక్ట్ చేసి, కింద ఓటర్ ఐడీ నంబర్ ఎంటర్ చేసి సెర్చ్ కొడితే మీ ఓటర్ స్లిప్ చూసిస్తుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకొని మీ ఓటు హక్కు ఉపయోగించుకోవచ్చు. అందులోనే మీ పోలింగ్ బూత్ వివరాలు కూడా ఉంటాయి.
- searchvoterslipulb.apec.gov.in లింక్ ద్వారా కూడా మీ పేరు, వార్డ్ నంబర్ వివరాలు నమోదు చేసి ఓటర్ స్లిప్ పొందొచ్చు. అలాగే electoralsearch.in జాతీయ ఓటర్ సర్వీస్ పోర్టల్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి అందులో మీ వివరాలు నమోదు చేసి సెర్చ్ చేస్తే ఓటర్ కార్డు వివరాలు కనిపిస్తాయి. వీటి నుంచి స్లిప్ డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకొని మీ ఓటు హక్కు ఉపయోగించుకోవచ్చు.
- e-EPIC ఐడీ పీడీఎఫ్ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ల్యామినేట్ కూడా చేయొచ్చు. డిజీలాకర్‌లో అప్‌లోడ్ చేయొచ్చు. ప్రస్తుతం జారీ చేస్తున్న పీవీసీ ఓటర్ ఐడీ కార్డుకు అదనంగా e-EPIC సర్వీస్ ప్రారంభమైంది.
- ఓటర్ పోర్టల్ http://voterportal.eci.gov.in/ లేదా ఓటర్ హెల్ప్‌లైన్ మొబైల్ యాప్ లేదా నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్ https://www.nvsp.in/ లో డౌన్‌లోడ్ చేయొచ్చు.
- కొత్తగా ఓటర్‌గా నమోదు చేసుకున్నవారు ఎవరైనా e-EPIC డౌన్‌లోడ్ చేయొచ్చు.
- ఓటర్ ఐడీ నెంబర్ తెలియకపోయినా e-EPIC ఇలా డౌన్‌లోడ్ చేయాలి. http://voterportal.eci.gov.in/ లేదా http://electoralsearch.in/ పోర్టల్స్‌లో మీ పేరు సెర్చ్ చేసి e-EPIC డౌన్‌లోడ్ చేయొచ్చు.
- ఫామ్ 6 రిఫరెన్స్ నెంబర్ ఉపయోగించి e-EPIC డౌన్‌లోడ్ చేసే అవకాశం కల్పిస్తోంది ఎన్నికల కమిషన్.
- e-EPIC డౌన్‌లోడ్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకొని పోలింగ్ స్టేషన్‌లో చూపించి మీ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.
- http://voterportal.eci.gov.in/ లేదా https://nvsp.in/ లేదా Voter Helpline Mobile App ప్లాట్‌ఫామ్స్ ద్వారా e-EPIC డౌన్‌లోడ్ చేయొచ్చు. లాగిన్ అయిన తర్వాత Download e-EPIC పైన క్లిక్ చేయాలి. EPIC నెంబర్ లేదా ఫామ్ రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేసి e-EPIC డౌన్‌లోడ్ చేయాలి. మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేయకపోతే e-KYC పూర్తి చేయాలి.
- మీ ఫోటో క్యాప్చర్ చేసి EPIC డేటాతో కంపేర్ చేస్తారు.
- ఈఆర్‌ఓ ఆఫీసుకు వెళ్లి ఫోటో ఐడీ ప్రూఫ్ సబ్మిట్ చేసి, మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేయాలి.
- మొబైల్ ఫోన్, ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌లో ఏదైనా ఒకటి ఉంటే చాలి. కెమెరా లేదా వెబ్‌క్యామ్ తప్పనిసరి.
- e-KYC ద్వారా మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేయాలి. e-KYC పూర్తైన తర్వాతే డౌన్‌లోడ్ చేయొచ్చు. కుటుంబ సభ్యులందరూ ఒకే మొబైల్ నెంబర్ ఉపయోగించొచ్చు.
Also Read: AP Panchayat Elections 2021 live: రసవత్తరంగా పంచాయతీ ‘తొలి’ పోరు.. కొనసాగుతున్న పోలింగ్..
