AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayashanthi: రాములమ్మ రాజకీయ అడుగులు తడబడ్డాయా..? తప్పుకున్నారా..? ఎందుకీ మౌనం?

కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతికి పెద్దగా ప్రయారిటీ మాత్రం దక్కలేదు. పార్టీ నేతలు ఆమెను ఎవరూ పట్టించుకున్న దాఖలాలు కూడా లేవట.

Vijayashanthi: రాములమ్మ రాజకీయ అడుగులు తడబడ్డాయా..? తప్పుకున్నారా..? ఎందుకీ మౌనం?
Vijayashanthi
Peddaprolu Jyothi
| Edited By: |

Updated on: Dec 07, 2024 | 12:15 PM

Share

ఆమె యాక్టర్ కమ్ పొలిటిషియన్.. నాడు ఎన్నో హిట్ మూవీస్ చేశారు. ఆ తర్వాత పొలిటికల్‌గా రాణించారు. ఎందుకో ఆమె ఈ మధ్య పెద్దగా కనిపించడం లేదు. అటు సినిమాల్లోనూ… ఇటు రాజకీయాల్లోనూ ఆమె సైలెంట్ అయ్యారు. దీంతో ఆమె రాజకీయ అడుగులు తడబడ్డాయా ? సినిమాల్లో సెకండ్ ఇన్సింగ్స్ కలిసిరావడం లేదా ? గాడ్ ఫాదర్స్ లేకపోవడంతోనే ఆమె స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారా ? అన్న చర్చ మొదలైంది.

ప్రతిఘటన.. కర్తవ్యం.. రాములమ్మ.. ఇలా ఎన్నో హిట్ మూవీల్లో నటించి మాస్ ఇమేజ్ తెచ్చుకున్న విజయశాంతి.. ఈ మధ్య ఎక్కడా కనిపించడం లేదు. సరిలేరూ నీకేవ్వరూ చిత్రంతో సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టినా.. ఆ తర్వాత మాయమైపోయారు. సినిమాల్లో సక్సెస్ ఫుల్ గా రాణించినా.. పొలిటికల్‌గా మాత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ఎదుర్కొంటున్నారు కూడా..!

సినిమా రంగంలో మంచి హవా కొనసాగుతున్న రోజుల్లోనే పొలిటికల్ అరంగ్రేట్ చేసి, భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ జాతీయ నేత ఎల్.కే.అద్వానీకి దగ్గరగా పనిచేశారు. అద్వానీ రథయాత్రల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా బీజేపీకి గుడ్ బై చెప్పారు. తల్లి తెలంగాణ పార్టీ స్థాపించి ప్రత్యేక రాష్ట్రం కోసవ పోరాటం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీని అప్పటి టీఆర్ఎస్‌లో విలీనం చేశారు. కేసీఆర్ స్వయంగా విజయశాంతిని పదో చెల్లిగా అభివర్ణించారు.

అప్పటి టీఆర్ఎస్ నుంచి మెదక్ లోక్‌సభ సభ్యురాలుగా విజయం సాధించారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో పెట్టిన సందర్భంలో ఆమె బీఆర్ఎస్ నుంచి లోక్‌సభలో ఉన్న ఏకైక ఎంపీ. ఆ తర్వాత కేసీఆర్.. ఆమెను పార్టీ నుంచి పక్కన పెట్టారు. వెంటనే విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. 2018 ఎన్నికలలో కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. మళ్లీ పొలిటికల్ గా మళ్లీ టర్న్ తీసుకున్నారు. 2019 ఎన్నికలు ముగిసిన వెంటనే.. మళ్లీ బీజేపీ గూటికి చేరుకున్నారు విజయశాంతి. మునుగోడు ఉప ఎన్నిక ముందు వరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. మునుగోడు ఉప ఎన్నిక ముగిసిన వెంటనే… ఆమె మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

హస్తం పార్టీలో చేరిన తర్వాత ఆమెకు పెద్దగా ప్రయారిటీ మాత్రం దక్కలేదు. పార్టీ నేతలు ఆమెను ఎవరూ పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన కొత్తలో సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో ట్విట్లు చేస్తూ.. నేనున్నాను అని గుర్తు చేస్తూ ఉండేది. ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరూ ఆమెను పట్టించుకోవడం లేదట. దీంతో రాములమ్మది రాజకీయ అద్యాయం ముగిసినట్లేనా ? అన్న చర్చ పార్టీలో నడుస్తోంది. పార్టీలు తరచూ మారడం ఆమెకు పెద్ద మైనస్ గా మారినట్లు చెప్పుకుంటున్నారు. రాజకీయాల్లో అడుగులు తడబడితే ఎలా ఉంటుందో చెప్పడానికి విజయశాంతి బెస్ట్ ఎంగ్జాపుల్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..