Telangana Congress: ఠాగూర్‌ది ఆరంభశూరత్వమేనా?.. తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త రచ్చ..

Telangana Congress: ఇంచార్జ్ ఎక్కడ? మొదట్లో ధూమ్ ధామ్ అనిపించినా ఆ పార్టీ ఇంచార్జ్ ఇప్పుడు రాం రాం అంటున్నారా? చీటికి..

Telangana Congress: ఠాగూర్‌ది ఆరంభశూరత్వమేనా?.. తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త రచ్చ..
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 04, 2022 | 1:57 PM

Telangana Congress: ఇంచార్జ్(Congress Incharge) ఎక్కడ? మొదట్లో ధూమ్ ధామ్ అనిపించినా ఆ పార్టీ ఇంచార్జ్ ఇప్పుడు రాం రాం అంటున్నారా? చీటికి మాటికీ పార్టీ ఆఫీసులో(Congress Party) మీటింగ్ పెట్టే ఆయన ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదు? పార్టీ లో రోజుకో సమస్య వొచ్చి పడుతున్నా సంబంధం లేనట్టు ఎందుకు వ్యవహరిస్తున్నారు ఇంతకీ ఎవరాయన?

నేను ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టే ఇది బాషా సినిమాలో మనిక్ బాషా డైలాగు ఈ డైలాగ్ కి కరెక్ట్ గా సరిపోయే పార్టీ ఇంచార్జ్ ఎవరయ్యా అంటే ఇంకెవరు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్(Manickam Tagore) కొత్త పిసిసి వొచ్చక దాదాపు నాలుగు నెలల పాటు గాంధీ భవన్ దగ్గర ఠాగూర్ రివ్యూ ల మీద రివ్యూ పెట్టారు ఏ సమస్య వొచ్చిన సరే వెంటనే స్పందించే వారు పిసిసి నియామకం పైన సీనియర్ నాయకులు తలో మాట మాట్లాడిన నా మాట శాసనం అన్నట్టు అందరికి సమాధానం చెప్పిన మాణిక్యం ఇప్పుడు గాంధీ భవన్ వైపే చూడట్లేదు

రేవంత్ పిసిసి పగ్గాలు చేపట్టిన మొదట్లో ఒక్కసారిగా పార్టీ లో ఊపు వొచ్చింది తరువాత జరిగిన హుజురాబాద్ ఎన్నికల ఫలితాలు ఒక్కసారిగా కాంగ్రెస్ ను కృంగదీసింది మొదట్లో ఇంచార్జ్ పార్టీ బలోపేతానికి మీటింగ్ లు రివ్యూ లు పెట్టె వారు హుజురాబాద్ తరువాత రాష్టానికి అసలు టైం ఇవ్వట్లేదు ..గతం లో మీటింగ్ అంటే కొత్త వ్యూహాలకు పార్టీ బలోపేతానికి కార్యచరణ గురించి చర్చించే వీలు ఉండేది ఇపుడు మీటింగ్ అంటే అంతర్గత కుమ్ములాటలు గురించే మాట్లాడాల్సి వొస్తుందని అందుకే దూరం గా ఉంటున్నారని సమాచారం

కాంగ్రెస్ పార్టీ లో అంతర్గత కుమ్ములాటలు సహజం..ఈ మధ్యకాలంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నుండి మొదలుకుని.. ఇటీవల క్రమశిక్షణ కమిటీ వరకు… ప్రతిదీ పార్టీ లో తలనొప్పికి దారి తీసింది. ఇటీవల జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం లో రాజీనామా ల వరకు వెళ్లింది వ్యవహారం. దీనిపై సీనియర్ నాయకులు కూడా కొంత అసంతృప్తి తోనే ఉన్నారు. సీనియర్ నేత జానారెడ్డి లాంటి వాళ్ళు కూడా ప్రస్తుతం పార్టీ లో పరిస్థితిపై కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు.ఇంత జరుగుతున్నా ఇంచార్జ్ మాత్రం నిమ్మకు నిరోత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు

మొత్తంమీద ఠాగూర్ ఆరంభ శూరత్వంపై రకరకాల విమర్శలను ఎదుర్కోక తప్పడం లేదు. ఠాగూర్ సమయం కేటాయించక పోవడం వల్లనే సమస్యలు ఎక్కువ అవుతున్నాయి అనే టాక్ ఉంది. పొలిటికల్ అఫైర్స్ కమిటీ కూడా యాక్షన్ ప్లాన్ కంటే… లీడర్స్ మద్య ఫైట్ కె ఎక్కువ టైం సరిపోతుంది. ఇంఛార్జి టాగూర్ సమయం కేటాయిస్తారా.. లేదంటే ఈ ఫైట్ ఇలాగే కొనసాగుతుందా..? అనేది చూడాలి.

-అశోక్ భీమనపల్లి, టీవీ 9

Also read:

Nandamuri Balakrishna: అవసరమైతే రాజీనామాకు సిద్ధం.. నందమూరి బాలకృష్ణ సంచలన కామెంట్స్..

Omicron Variant: ఒమిక్రాన్‌ బాధితుల్లో ఎక్కువగా యువతే.. ఐసీఎంఆర్‌ సర్వేలో సంచలన నిజాలు..!

UPSC Civil Services 2022: యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ 2022 పరీక్షకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. జూన్ 5 న పరీక్ష!