Telangana Rains: తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో ఈదురు గాలులు.. లేటెస్ట్‌ వెదర్‌ రిపోర్ట్‌ ఇదే

తెలంగాణలో మరో మూడు రోజులు పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. అదే విధంగా మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపుల తో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇక తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఈదురుగాలులు కారణంగా ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది.

Telangana Rains: తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో ఈదురు గాలులు.. లేటెస్ట్‌ వెదర్‌ రిపోర్ట్‌ ఇదే
Rains
Follow us

|

Updated on: May 22, 2023 | 1:56 PM

తెలంగాణలో మరో మూడు రోజులు పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. అదే విధంగా మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపుల తో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇక తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఈదురుగాలులు కారణంగా ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో గంటకు 40 నుండి 50 కీ.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక హైదరాబాద్‌ విషయానికొస్తే.. జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో నేటి సాయంత్రం నుంచి మళ్లీ వర్షాలు మొదలవుతాయని అలెర్ట్‌ జారీ చేసింది. అయితే యథావిధిగా పగటిపూట ఉష్ణోగ్రతలు ఉంటాయని పెరిగింది. కాగా గడిచిన 24 గంటల్లో అదిలాబాద్‌ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదిలాబాద్ 43 , మెదక్ 42.2 , రామగుండం 42.2, నిజామాబాద్ 42.1, నల్గొండ 41.5, హన్మకొండ 40.5, మహబూబ్‌నగర్ 40.4, హైదరాబాద్ 40.3 , భద్రాచలం 39.6 , ఖమ్మం 39 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత నమోదైంది.

కాగా హైదరాబాద్ నగరంలో ఆదివారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. రాజేంద్రనగర్, అంబర్ పేట, శేరిలింగంపల్లి, సంతోష్ నగర్, ఎల్బీనగర్, సికింద్రాబాద్, ఉప్పల్ ఏరియాల్లో కుండపోత వర్షం పడింది. రాజేంద్రనగర్‌ 4.6 సెం.మీల వర్షపాతం, అంబర్‌పేట, శేరిలింగంపల్లిలో 3.9 సెం.మీ శివరాంపల్లిలో 3.9 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో అంధకారం అలముకుంది. రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరుకుంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..