Telangana: విద్యుత్ సబ్‌స్టేషన్ దగ్గర ఒక్కసారిగా అలజడి.. ఏంటో చూసి భయంతో పరుగులు తీసిన సిబ్బంది..
కామారెడ్డి జిల్లాలో పట్టపగలు చిరుత సంచారం కలకలం రేపింది. పిట్లం మండలం చిన్న కొడప్‌గల్ సబ్ స్టేషన్‌లో సంచరిస్తున్న చిరుత సిబ్బంది కంట పడటంతో తీవ్ర భయాందోళకు గురయ్యారు. అటవీ ప్రాంతాన్ని ఆనుకొని విద్యుత్ సబ్ స్టేషన్ ప్రాంతంలో ఆదివారం చిరుత సంచరిస్తూ కనిపించింది.

కామారెడ్డి జిల్లాలో పట్టపగలు చిరుత సంచారం కలకలం రేపింది. పిట్లం మండలం చిన్న కొడప్‌గల్ సబ్ స్టేషన్‌లో సంచరిస్తున్న చిరుత సిబ్బంది కంట పడటంతో తీవ్ర భయాందోళకు గురయ్యారు. అటవీ ప్రాంతాన్ని ఆనుకొని విద్యుత్ సబ్ స్టేషన్ ప్రాంతంలో ఆదివారం చిరుత సంచరిస్తూ కనిపించింది. ఫెన్నింగ్ అడ్డుగా ఉండటంతో చిరుత స్టేషన్ లోపలికి రాలేదని, అక్కడి సిబ్బంది ఒకరు తెలిపారు. విద్యుత్ సబ్ స్టేషన్ ప్రాంతంలో చిరుత పులి రావడంతో అక్కడి ఉద్యోగులు, స్థానికులు భయంతో వణికిపోయారు.
ఈ ప్రాంతంలో అప్పుడప్పుడు చిరుత పులి కనిపిస్తోందనే మాట పుకారు గానే అనిపించినా.. ఆదివారం మాత్రం విద్యుత్ సిబ్బంది కళ్లారా చూశారు. విషయం అటవీశాఖ అధికారులకు సమాచారమందించారు. చిరుత సంచారం గురించి అటవీశాఖ అధికారులు నిర్ధారించడంతో జనం ఉలిక్కి పడ్డారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చిరుత పులిపై నిఘా పెట్టామని ఫారెస్టు రేంజ్ అధికారి సంజయ్ గౌడ్ తెలిపారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం..