YS Sharmila: వరంగల్‌తో రాజశేఖర్ రెడ్డికి ప్రత్యేక అనుబంధం ఉంది.. ఆత్మీయ సమ్మేళనంలో వైఎస్ షర్మిల

YS Sharmila Warangal meeting: వరంగల్‌తో మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డికి ప్రత్యేక అనుబంధం ఉందని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. వైఎస్సార్ ఉండి ఉంటే.. వరంగల్ అభివృద్ధిలో దూసుకుపోయేదని..

YS Sharmila: వరంగల్‌తో రాజశేఖర్ రెడ్డికి ప్రత్యేక అనుబంధం ఉంది.. ఆత్మీయ సమ్మేళనంలో వైఎస్ షర్మిల
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 10, 2021 | 6:12 PM

YS Sharmila Warangal meeting: వరంగల్‌తో మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డికి ప్రత్యేక అనుబంధం ఉందని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. వైఎస్సార్ ఉండి ఉంటే.. వరంగల్ అభివృద్ధిలో దూసుకుపోయేదని షర్మిల పేర్కొన్నారు. వరంగల్ జిల్లా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులతో బుధవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో వైఎస్ షర్మిల మాట్లాడారు. ఈ సమావేశానికి ముందు షర్మిల ప్రొఫెసర్ జయశంకర్‌కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ అభిమానులు కాబోయే సీఎం షర్మిల అంటూ నినాదాలు చేశారు.

అనంతరం షర్మిల మాట్లాడుతూ.. తెలంగాణ జాతిపిత జయశంకర్ సార్, కవి కాళోజి లాంటి మహానుభావులు పుట్టిన గడ్డ ఓరుగల్లు గడ్డ అని కొనియాడారు. వరంగల్‌తో వైఎస్‌ఆర్‌కి ప్రత్యేక అనుబంధముందని.. ఆయన ఉంటే.. నగరం అభివృద్ది చెందేదని పేర్కొన్నారు. ఉద్యమాన్ని ఉరకలెత్తించిన గీతం రాసిన అందెశ్రీదీ ఓరుగల్లు గడ్డేనని పేర్కొన్నారు. వరంగల్‌ను ఐటీ హబ్‌గా చేయాలని వైఎస్‌ఆర్‌ కలలుగన్నారని.. కానీ నెరవరలేదని పేర్కొన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును 80 శాతం పూర్తి చేసిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందన్నారు.

కంతన్ పల్లి ప్రాజెక్ట్ ను పూర్తి చేయక పోవడం చాలా బాధాకరమంటూ పలు ప్రశ్నలు సంధించారు. కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ ఎందుకు రాలేదో ఆలోచించాలి. వరంగల్‌ ఇంకా ఎందుకు స్మార్ట్‌ సిటీ కాలేదో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. ఉద్యమ పురిటిగడ్డ కాకతీయ యూనివర్సిటీకి.. కనీసం వీసీని నియమించలేకపోయారని.. ప్రశ్నించిన విద్యార్థులపై దాడులు చేస్తున్నారంటూ షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజా సలహాలు, సూచనల కోసం తమముందుకు వచ్చానని ఆదరించాలంటూ షర్మిల పేర్కొన్నారు.

Also Read:

Telangana MLC Elections : నాలుగు రోజులే టైం, అందరికీ ఒక్కటే టార్గెట్‌, 2 సీట్లు.. 13 మంది మంత్రులు, కత్తిమీద సాములా ఎమ్మెల్సీ ఎన్నికలు

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే