Telangana MLC Elections : నాలుగు రోజులే టైం, అందరికీ ఒక్కటే టార్గెట్, 2 సీట్లు.. 13 మంది మంత్రులు, కత్తిమీద సాములా ఎమ్మెల్సీ ఎన్నికలు
Telangana MLC Elections : 2 సీట్లు. 13 మంది మంత్రులు. అందరికీ ఒక్కటే టార్గెట్. తేడా వచ్చిందో... గోవింద. ఇదే టెన్షన్ అమాత్యులను వెంటాడుతోంది. అందుకే రాత్రీ పగలు తేడా లేకుండా కష్టపడుతున్నారు..
Telangana MLC Elections : 2 సీట్లు. 13 మంది మంత్రులు. అందరికీ ఒక్కటే టార్గెట్. తేడా వచ్చిందో… గోవింద. ఇదే టెన్షన్ అమాత్యులను వెంటాడుతోంది. అందుకే రాత్రీ పగలు తేడా లేకుండా కష్టపడుతున్నారు. ఎలాగైనా టార్గెట్‌ను రీచ్ కావాలని చెమటోడుస్తున్నారు. మరి సక్సెస్ అవుతారా? చెప్పాలంటే.. తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు మంత్రులకు కత్తిమీద సాములా మారాయి. ఆరు ఉమ్మడి జిల్లాలు… 77 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రెండు ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్‌కు ఇంకా టైం నాలుగు రోజులే ఉంది. ప్రచారానికి రెండు రోజుల సమయమే ఉంది. ఒకటి సిట్టింగ్ సీటు, మరోటి బీజేపీ సీటు. ఎలాగైనా ఈ రెండింటినీ గెలవాలనేది గులాబీ ప్లాన్. అందులో మంత్రులే కీలకం. ఆరు జిల్లాల పరిధిలో 13 మంది మంత్రులు ఎన్నికల వ్యూహాల్లో బిజీబిజీగా ఉన్నారు. ఇక మరో పని పెట్టుకోకుండా… గ్రాడ్యుయేట్ల ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నంలో ఉన్నారు.
హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ సీటు పరిధిలోనే ఎక్కువ మంది మంత్రులు ఎన్నికల బాధ్యతల్లో ఉన్నారు. హరీష్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్ ఈ మూడు జిల్లాలకు ఇన్‌ఛార్జులుగా ఉన్నారు. మహబూద్‌అలీ, తలసాని, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ తమ జిల్లాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వరంగల్ – నల్గొండ – ఖమ్మం పరిధిలో పువ్వాడ అజయ్, ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, జగదీష్‌రెడ్డి ఎన్నికల పనిలో ఉన్నారు. ఆయా జిల్లాల్లో పూర్తి బాధ్యత వీరిదే. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కోఆర్డినేట్ చేయడం, ప్రతి 50 మందికి ఒక బాధ్యుడిని పెట్టి మానటరింగ్ చేయడంలో ఫుల్ బిజీగా ఉన్నారు 13 మంది మంత్రులు.
దుబ్బాక, గ్రేటర్ ఫలితాలతో… ఈ రెండు ఎమ్మెల్సీ సీట్లు గెలవడం టీఆర్‌ఎస్‌కు అనివార్యంగా మారింది. ఇదే మంత్రుల్లో టెన్షన్ రేపుతోంది. ఫలితం ప్రతికూలంగా వస్తే తమ పరిస్థితి ఏంటనే ఆందోళన మంత్రులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందనే ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఉంటుందనే వార్తలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు మంత్రులకు కత్తి మీద సాములా మారాయి. ఏ సీటు ఓడిపోయినా.. అక్కడ ఉన్న మంత్రుల్లో ఎవరి పదవికి గండం వస్తుందోనన్న చర్చ సాగుతోంది. దీంతో ఎలాగైనా రెండు సీట్లలో గెలవాలన్న పట్టుదల మంత్రుల్లో కనిపిస్తోంది. ఈ ఫలితాల తర్వాత TRS ప్రభుత్వం కూలిపోవడం ఖాయం అంటూ బీజేపీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో MLC ఎన్నికలు మంత్రులకు మరింత సవాల్‌గా మారాయి. ఎక్కడ రివర్స్ కొట్టినా గులాబీ బాస్ ఆగ్రహానికి గురికాక తప్పదనే టెన్షన్‌లో మంత్రులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
Read also :