Warangal: వరదల్లో ఓరుగల్లు.. ఎటు చూసినా వ్యథలే.. టీవీ9 రిపోర్టర్ కంటతడి
వరద ప్రవాహంలో చిక్కుకొని బాధితులు ఏవిధంగా ఆర్తనాదాలు చేశారో!. కాపాడండి అంటూ ఏవిధంగా కేకలు వేశారో!. బాధితులను కాపాడేందుకు అధికార యంత్రాంగం... ప్రాణాలకు ఎలా తెగించిందో! వీటన్నంటినీ దగ్గరుండి, స్వయంగా చూస్తా... రిపోర్టింగ్ చేసిన మా టీవీ9 వరంగల్ ప్రతినిధి పెద్దీష్ భావోద్వేగానికి గురయ్యారు. వారం రోజులుగా ప్రజల బాధలను చూసి తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నారు.

వరంగల్, జులై 31: వాన రావడం లేదు.. విత్తు పెట్టేది ఎప్పుడు.. అసలు ఈ ఏడాది ఓ మాదిరిగా అయినా వర్షాలు కురుస్తాయా..? ఇది ఒక వారం ముందు వరకు ఉన్న డౌట్. కానీ వరుణుడు ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. అల్లకల్లోలం సృష్టించాడు. రోజులు తరబడి గ్యాప్ లేకుండా.. ఆకాశానికి చిల్లు పడిందా అన్న రేంజ్‌లో పరిస్థితి ఉంది. దీంతో చాలా ప్రాంతాలను వరదనీరు చుట్టుముట్టుంది. జలాశయాలు నీటితో నిండిపోయాయి. చాలామంది లోతట్టు ప్రాంతాల ప్రజలు వరద బారిన పడ్డారు. కరెంట్ లేని పరిస్థితి. కొన్ని చోట్ల తిండి లేక అల్లాడిపోయారు ప్రజలు. ముఖ్యంగా వరంగల్ జిల్లా అంతా అల్లకల్లోలం అయిపోయింది. ప్రకృతి ప్రకోపానికి విలవిల్లాడింది.
ఓరుగల్లు కన్నీరు పెడుతోంది!. ఎటుచూసినా గుండెలు పిండేసే దృశ్యాలే!. ఏ ఊరును కదిపినా గుండెకోతే!. ఎక్కడ చూసినా హృదయ విదారక పరిస్థితులే!. ఇంతకు ముందెన్నడూ చూడని జలవిలయంతో కకావికలమైంది ఉమ్మడి వరంగల్. ప్రాణాలు దక్కితే చాలు అన్నట్టుగా చెట్టుకొకరు-పుట్టకొకరుగా చెల్లాచెదురయ్యారు ప్రజలు. వరద ప్రళయం దెబ్బకు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. ప్రజలైతే ప్రాణాలతో బయటపడ్డారేమోగాని… మూగజీవాలైతే విగతజీవులుగా మారాయ్!. ఏ ఊరును చూసినా అదే పరిస్థితి! ఏ ఇంటిని కదిపినా కన్నీటి గాథలే!.
ఓరుగల్లు ఎంతటి జలప్రళయాన్ని చూసిందో!. ప్రజలు ఎలాంటి భయానక పరిస్థితులు ఎదుర్కొన్నారో!. వరద ప్రవాహంలో చిక్కుకొని బాధితులు ఏవిధంగా ఆర్తనాదాలు చేశారో!. కాపాడండి అంటూ ఏవిధంగా కేకలు వేశారో!. బాధితులను కాపాడేందుకు అధికార యంత్రాంగం… ప్రాణాలకు ఎలా తెగించిందో! వీటన్నంటినీ దగ్గరుండి, స్వయంగా చూస్తా… రిపోర్టింగ్ చేసిన మా టీవీ9 వరంగల్ ప్రతినిధి పెద్దీష్ భావోద్వేగానికి గురయ్యారు. వారం రోజులుగా ప్రజల బాధలను చూసి తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నారు. 30ఏళ్ల జర్నలిజం కెరీర్‌లో ఇంతకుముందెన్నడూ ఇంతటి జలప్రళయాన్ని చూడలేదని, ప్రజలు ఈవిధంగా ప్రాణభయంతో అల్లాడిపోవడం చూడలేదంటూ భోరున విలపించారు మా ప్రతినిధి పెద్దీష్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..




