హనుమకొండలో పట్ట పగలే భారీచోరీ.. కారు అద్దాలు పగలగొట్టి రూ. 25లక్షల లూఠీ..
హనుమకొండలో పట్ట పగలే భారీచోరీ రిగింది. ఓ ప్రయివేటు బ్యాంకు వద్ద దోపిడీ దొంగలు రెచ్చి పోయారు. కారులో భద్రపర్చిన 25లక్షల నగదును లూఠీ చేశారు దొంగలు. ఏకంగా కారు అద్దాలు..
Cash Stolen: హనుమకొండలో పట్ట పగలే భారీచోరీ రిగింది. ఓ ప్రయివేటు బ్యాంకు వద్ద దోపిడీ దొంగలు రెచ్చి పోయారు. కారులో భద్రపర్చిన 25లక్షల నగదును లూఠీ చేశారు దొంగలు. ఏకంగా కారు అద్దాలు పగలగొట్టి అందులోని డబ్బంతా వూడ్చుకు పోయారు. రంగంలోకి దిగిన పోలీసులు CCTV విజువల్స్ ఆధారంగా నిందితుడిని పట్టుకునే పనిలో ఉన్నారు. ఈ దోపిడీ హన్మకొండ నక్కలగుట్ట ప్రాంతంలోని HDFC బ్యాంక్ దగ్గర జరిగింది. బ్యాంకు ముందు పార్కింగ్ చేసిన TS 03EE 6677 నెంబర్ గల కారు అద్దాలు ధ్వంసంచేసి అందులోని 25 లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు గుర్తుతెలియని దుండగులు. ప్రకాశ్ రెడ్డి పేట ప్రాంతానికి చెందిన తిరుపతి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి HDFC బ్యాంకు నుండి ఈ డబ్బులు డ్రా చేశాడు.
డబ్బంతా కారులో పెట్టి తిరిగి బ్యాంకుల్లోకి వెళ్ళాడు. బ్యాంకు పని పూర్తి చేసుకొని తిరిగి వచ్చేసరికి గుర్తు తెలియని దుండగులు డబ్బంతా దోచేశారు. కారు అద్దాలు ధ్వంసం చేసి 25లక్షలు ఊడ్చుకు పోయారు. దీంతో తీవ్ర ఆందోళన చెందిన బాధితుడు పోలీసులకు పిర్యాదు చేశాడు. ఈ క్రమంలో వెంటనే అప్రమత్తమైన సుబేదారి పోలీసులు విచారణ చేపట్టారు సెంట్రల్ జోన్ డిసిపి పుష్ప ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
బ్యాంకులోని సీసీ కెమెరా దృశ్యాలు, పక్కనే ఉన్న షాపింగ్ మాల్ సీసీ కెమెరా దృశ్యాలను గమనించిన పోలీసులు 20 ఏళ్ల లోపు యువకుడు ఒక్కడే ఈ దోపిడీకి పాల్పడినట్లు గుర్తించారు. దోపిడీకి పాల్పడిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు..
ఇవి కూడా చదవండి: CM Jagan: రహదారులపై సీఎం జగన్ ఫోకస్.. రోడ్ల మరమ్మతులపై అధికారులకు డెడ్‌లైన్..
Salman Khurshid: సల్మాన్ ఖుర్షీద్ పుస్తకంపై రచ్చ.. కాంగ్రెస్ సీనియర్ నేత ఇంటిపై దాడి..
Home Loan: అతి తక్కువ వడ్డీకి హోం లోన్ కావాలా.. ఆ బ్యాంక్‌లో అదిరిపోయే బంపర్ ఆఫర్..