AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: తెలంగాణ నయాగరా.. బొగత వాటర్ ఫాల్స్‌కు పోటెత్తిన పర్యాటకులు

తెలంగాణ నయాగరా బొగత జలపాతాలు పాలధారలా జాలువారుతున్నాయి. చూపరులను కనువిందు చేస్తున్నాయి.. రోకల్లు పగిలే రోహిణీ కార్తెలో తొలకరి వర్షాలు వరద నీటితో ఆ జలపాతాలకు సరికొత్త కళ సంతరించుకుంది.. ఇప్పుడిప్పుడే జనం జలపాతాల వద్దకు పరుగులు పెడుతున్నారు.. అందులో జలకాలాటలతో ఎంజాయ్ చేస్తున్నారు..

Watch: తెలంగాణ నయాగరా.. బొగత వాటర్ ఫాల్స్‌కు పోటెత్తిన పర్యాటకులు
Bogatha Waterfalls
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: May 29, 2025 | 11:45 AM

Share

తెలంగాణ నయాగరా బోగత జలపాతాలలో తొలకరి వరద నీరు జాలువారుతుంది.. 50 అడుగులు ఎత్తునుండి పాలధారలా జాలువరుతున్న జలపాతాలను వీక్షించేందుకు జనం పరుగులు పెడుతున్నారు..జలపాతాలలో జలకాలాడుతూ తనివితీరా ఎంజాయ్ చేస్తున్నారు. ఎండలు మండిపడే రోహిణి కార్తెలోనే రుతు పవనాల రాకతో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి.. మే నెలలో బోసిపోయి కనిపించే జలపాతాలకు జలకళ సంతరించుకుంది… ఎగువ ప్రాంతాల్లోని చెత్తిస్ గడ్ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో బొగత జలపాతాలకు జలకళ సంతరించుకుంది..

ములుగు జిల్లా వాజేడు మండలం చేకుపల్లి సమీపం లోని బోగత జలపాతాలు ప్రస్తుతం చూడడానికి కన్నుల విందుగా కనిపిస్తున్నాయి.. ఎంత దూరం ప్రయాణం చేసినా ఈ జలపాతాలు కంటపడితే చాలు ఆ అలసట మరిచిపోయి తన్మయత్వంతో ఉప్పొంగిపోయేలా చేస్తున్నాయి.. బోగత జలపాతాలు సందర్శనకు వచ్చే జనం తినివితీరా ఎంజాయ్ చేస్తున్నారు..

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం వేసవి సెలవులు ఉండడంతో సందర్శకుల తాకిడి మరింత పెరిగింది.. బొగత జలపాతాల వద్దకు పరుగులు పెడుతున్న జనం ఇందులో జలకాలాటలతో ఎంజాయ్ చేస్తున్నారు.. ప్రమాదాలు సంభవించకుండా అటవీశాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..