అమ్మో మిల్స్ కాలనీ..! ఆ స్టేషన్‌లో అడుగు పెట్టేందుకు జంకుతున్న పోలీసు అధికారులు
వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్ హాట్ టాపిక్‌గా మారింది. అక్కడ పోస్టింగ్ అంటే ఇన్స్‌పెక్టర్లు అమ్మో అంటున్నారు. ఆ ఠాణాలో మితిమీరిన స్వామి భక్తే.. SHOల కుర్చీకి ఎసరు పెడుతుందట..! అక్కడ కుర్చీలో కుదురుకునేలోపే ఏదో ఒక వివాదం వారిని చుట్టు ముట్టడం వెనక అసలు మతలబేంటి..? అసలు ఆ పోలీస్ స్టేషన్ ఎందుకు వివాదాస్పదంగా మారింది?

వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్ హాట్ టాపిక్‌గా మారింది. అక్కడ పోస్టింగ్ అంటే ఇన్స్‌పెక్టర్లు అమ్మో అంటున్నారు. ఆ ఠాణాలో మితిమీరిన స్వామి భక్తే.. SHOల కుర్చీకి ఎసరు పెడుతుందట..! అక్కడ కుర్చీలో కుదురుకునేలోపే ఏదో ఒక వివాదం వారిని చుట్టు ముట్టడం వెనక అసలు మతలబేంటి..? అసలు ఆ పోలీస్ స్టేషన్ ఎందుకు వివాదాస్పదంగా మారిందన్న ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
తెలంగాణలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ తర్వాత మరో అతిపెద్ద పోలీస్ కమిషనరేట్‌గా వరంగల్ పోలీస్ కమిషనర్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. వరంగల్ కమిషనరేట్ పరిధిలో అన్ని విభాగాలు కలిపి మొత్తం 71 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో కొన్ని పోలీస్ స్టేషన్లకు ఇన్స్‌పెక్టర్ స్థాయి అధికారులు SHO లుగా బాధ్యతలు నిర్వహిస్తుంటే, మరికొన్ని పోలీస్ స్టేషన్లకు సబ్ ఇన్స్‌పెక్టర్లు SHOలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
నేరాల నియంత్రణ, నేరస్తులను పట్టుకోవడంలో వరంగల్ పోలీసులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలంగాణ రాష్ట్రంలోనే ఎవర్ విక్టోరియాస్ గా ప్రత్యేక గుర్తింపు ఉంది ఓరుగల్లు పోలీసులకు. గతమెంతో ఘన చరిత్రలు కలిగిన వరంగల్ కమిషనరేట్ ను ఈ మధ్య వరుస వివాదాలు, అప్రతిష్టలు వెంటాడుతున్నాయి. స్తానిక ప్రజాప్రతినిధుల మెప్పు కోసం పోలీస్ అధికారులు ప్రదర్శిస్తున్న మితిమీరిన ఉత్సాహం కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. ముఖ్యంగా మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో పోస్టింగ్ నిర్వహించే ప్రతీ పోలీస్ అధికారి ఏదో ఒక వివాదంలో ఇరుక్కొని వాళ్ళ కుర్చీకి ఎసరు పెట్టుకుంటున్నారు. ఖాకీ డ్రెస్ పై చెరగని మచ్చ పడేలా చేస్తున్నారు.
వరంగల్ నగరంలో మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ అంటేనే ఇప్పుడు వివాదాలకు కేరాఫ్ గా మారింది. ఇక్కడ పోస్టింగ్ నిర్వహించే ప్రతి పోలీస్ అధికారి ఏదో ఒక వివాదంలో ఇరుక్కున్న వారే. సాధారణంగా ఏ పోలీస్ స్టేషన్ కైనా SHO లు రెండేళ్లకు పైగా విధులు నిర్వహిస్తారు. కానీ ఈ పోలీస్ స్టేషన్ లో మాత్రం రెండేళ్ల వ్యవధిలో నలుగురు ఇన్స్‌పెక్టర్లు మారారు. గత పదేళ్ల రికార్డు చూసినట్లయితే 11 మంది ఇన్స్‌పెక్టర్లకు ఇక్కడ స్థానచలనం కలిగింది.
అయితే ఇక్కడ పోస్టింగ్ నిర్వహించే అధికారులు స్థానికంగా ఉండే ప్రజా ప్రతినిధుల వద్ద అతిగా స్వామి భక్తిని ప్రదర్శించడమే ఈ వివాదాలకు కారణమని, వాళ్ళ కుర్చీకి పెసర పడుతుందని స్థానికంగా చర్చ జరుగుతుంది. దీనికి తోడు పోలీస్ స్టేషన్ కు కూడా వాస్తు దోషం ఉందని డిపార్ట్‌మెంట్‌లో హాట్ హాట్ చర్చగా జరుగుతుంది. అంతేకాదు పోలీస్ స్టేషన్ కు పక్కనే సమాధులు ఉంటాయి. ఒకప్పుడు సమాధులు ఉన్న ప్రాంతంలోనే పోలీస్ స్టేషన్ నిర్మించడం వల్ల ఇక్కడ పోస్టింగ్ నిర్వహించే వారిని ఏదో ఒక వివాదం వెంటాడుతుందని చర్చ జరుగుతుంది.
ఇది చదవండిః Telangana: సీఐపై సస్పెన్షన్ వేటు.. నగరంలో సంబరాలు.. ఇంతకు అతను ఏం చేశారు?
తాజాగా వారం రోజుల క్రితం ఇదే పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న వెంకటరత్నం సస్పెండ్ అవడంతో ఇప్పుడు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ పోస్టింగ్ అంటేనే ఇన్స్‌పెక్టర్లు అమ్మో అంటున్నారు. ఎవరైనా ధైర్యం చేసి వస్తే ఎప్పుడు ఏ రూపంలో వాళ్ల కుర్చీకి ఎసరు వస్తుందో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే వివాదాలు నిలయంగా మారిన మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో గతవారం రోజుల నుండి SHO కుర్చీ ఖాళీగానే ఉంది. ఒకరిద్దరు ఆ పోస్టింగ్ కోసం దైర్యం చేస్తున్నా.. లోలోపల మాత్రం అమ్మో అనే భయంతోనే ఉన్నారట..! ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరు వాళ్ళ సర్వీస్ రికార్డులో చెరగని ఇంక్ పడేలా చేసుకున్నారు. ఇక రాబోయే పోలీస్ అధికారి ఎవరో..! వారిని ఏ వివాదం వెంటాడుతుందో వేచి చూడాలి..!
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..