Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: సీఐపై సస్పెన్షన్ వేటు.. నగరంలో సంబరాలు.. ఇంతకు అతను ఏం చేశారు?

వరంగల్ కమిషనరేట్ లో వివాదాస్పద సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా గత కొంతకాలం నుండి ముద్రవేసుకున్న మిల్స్ కాలనీ సీఐ వెంకటరత్నంపై సస్పెన్షన్ వేటు పడింది. నన్ను ఎవరు ఏం చేయలేరన్నట్లుగా చెలరేగిపోయిన ఆ సీఐ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడటంతో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సస్పెన్షన్ వేటు వేశారు.

Telangana: సీఐపై సస్పెన్షన్ వేటు.. నగరంలో సంబరాలు.. ఇంతకు అతను ఏం చేశారు?
Wgl
G Peddeesh Kumar
| Edited By: Anand T|

Updated on: May 20, 2025 | 6:59 PM

Share

వరంగల్ కమిషనరేట్ పరిధిలోని పరకాలలో పీఎస్‌లో గతంలో సిఐగా పనిచేసిన వెంకటరత్నం కొద్దిరోజుల క్రితం అక్కడి నుండి వరంగల్ నగరంలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌ పీఎస్‌కు ట్రాన్స్‌ఫర్ అయ్యారు ఇక్కడ సిఐగా బాధ్యతలు స్వీకరించారు. అయితే స్థానిక మంత్రి అనుచరుడి మెప్పుకోసం కొన్నాళ్లు వాళ్లకు అనుకూలంగా పని చేసిన ఇతను వాళ్ల ద్వారా ప్రశంసలు పొందాడు. ఆ తర్వాత కొన్ని విషయాల్లో వారిని తప్పుదారి పట్టించి తన వ్యక్తిగత కార్యక్రమాలతో పోలీస్ శాఖకు మచ్చ తెచ్చే విదంగా ప్రవర్తించారని అతనిపై విమర్శలు ఉన్నాయి. అయితే నగరంలో కొద్దిరోజుల క్రితం హత్యకు గురైన ఓ వైద్యుడి భార్యపట్ల ఇతను అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీస్ శాఖలో తీవ్ర చర్చ జరిగినట్టు సమాచారం.

అయితే వైద్యుడి హత్యకేసులో అతని భార్యే ప్రధాన నిందితురాలిగా గుర్తించిన పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ప్రియుడితో కలిసి భార్తను హత్య చేసిందని ప్రియుడితో సహా ఆమెను జైలుకు పంపారు. ఈ క్రమంలో జైల్లో ఖైదీగా ఉన్న వైద్యుడి భార్యను విచారణ పేరుతో మూడురోజుల కస్టడీకి తీసుకున్న సీఐ.. పీఎస్‌ ఆవరణలోనే ఆమె పట్ల లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే కస్టడీ విచారణ తర్వాత ఆమెను జైలుకు తరలించే సమయంలో ఈ విషయం బయటికి రావడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ సున్ ప్రీత్ సింగ్ ఘటనపై విచారణ చేపట్టారు.విచారణలో లైంగిక వేధింపులు నిజమని తేలడంతో ఆ సీఐను సీపీ సస్పెండ్ చేశారు.

అయితే ఇతనిపై ఇవే కాకుండా మరికొన్ని ఆరోపణలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కొన్ని విషయాల్లో మంత్రి అనుచరుడి మెప్పుకోసం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఇస్టా రాజ్యంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. మంత్రి అనుచరుడు చెప్పిన వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ వీడియో కాల్ ద్వారా వారిని సంతృప్తి చెందేలా చేసేవారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో సీఐపై వచ్చిన ఆరోపణలు నిర్ధారణ కావడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సీఐ వెంకటరత్నంను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీఐ సస్పెండ్ కావడంతో వరంగల్‌లోని ఆయన బాధితులు సంబరాలు జరుపుకుంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ తేదీల్లో జన్మించిన వారిపై శుక్రుని ఆశీస్సులు సక్సెస్ వీరి సొంతం
ఈ తేదీల్లో జన్మించిన వారిపై శుక్రుని ఆశీస్సులు సక్సెస్ వీరి సొంతం
నిమిషా ప్రియ ఉరిశిక్ష రద్దు అయ్యేనా..!? ఆ చర్చలపైనే అందరి ఆశలు..
నిమిషా ప్రియ ఉరిశిక్ష రద్దు అయ్యేనా..!? ఆ చర్చలపైనే అందరి ఆశలు..
ఏంటీ .. ఆ స్టార్ హీరో రవితేజ సినిమాలో నటించాడా..!!
ఏంటీ .. ఆ స్టార్ హీరో రవితేజ సినిమాలో నటించాడా..!!
విదేశాల్లో ఉన్న ఈ ఫేమస్ శివాలయాల గురించి తెలుసా?
విదేశాల్లో ఉన్న ఈ ఫేమస్ శివాలయాల గురించి తెలుసా?
ఆపినా ఆగకుండా దూసుకెళ్తున్న బొలెరో వాహనం.. పట్టుకుని చెక్ చేయగా..
ఆపినా ఆగకుండా దూసుకెళ్తున్న బొలెరో వాహనం.. పట్టుకుని చెక్ చేయగా..
నోటి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే అలవాట్లు ఇవే.. ఎలా గుర్తించాలంటే
నోటి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే అలవాట్లు ఇవే.. ఎలా గుర్తించాలంటే
చిరు, మహేష్ బాబు కాంబోలో మిస్సైన బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవే!
చిరు, మహేష్ బాబు కాంబోలో మిస్సైన బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవే!
బాల రామాయణం సీతమ్మ.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
బాల రామాయణం సీతమ్మ.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
చిన్నగా ఉందనుకోకండి.. వర్షకాలంలో బోడకాకరతో బోలెడు లాభాలు!
చిన్నగా ఉందనుకోకండి.. వర్షకాలంలో బోడకాకరతో బోలెడు లాభాలు!
ఇంట్లో ఈ నాలుగు మొక్కలు ఉంటే దరిద్రమే.. వెంటనే తీసేయ్యండి!
ఇంట్లో ఈ నాలుగు మొక్కలు ఉంటే దరిద్రమే.. వెంటనే తీసేయ్యండి!