ఎడారిలో ఒంటెలు.. కేదారినాథ్‌లో గుర్రాలు.. మరీ అక్కడ పుష్కరాలకు వెళ్తే వాటిపైనే సవారీ..!
ఒక్కో ప్రాంతంలో ఒక్కో ప్రత్యేకత..! రాజస్థాన్ ఎడారికి వెళ్తే ఒంటెలపై ప్రయాణం.. అదే కేదారినాథ్, అమర్నాథ్ యాత్రకు వెళ్తే గుర్రాలపై సవారీ ఉంటుంది.. కానీ సరస్వతీ పుష్కరాల్లో మాత్రం ఎడ్ల బండ్లపై సవారీ సంథింగ్ స్పెషల్..! పార్కింగ్ స్థలం నుండి గోదావరి వరకు హాయిగా ఎడ్ల బండ్లలో సవారీ చేస్తున్న భక్తులు జోరుగా షికారు చేస్తున్నారు.

ఒక్కో ప్రాంతంలో ఒక్కో ప్రత్యేకత..! రాజస్థాన్ ఎడారికి వెళ్తే ఒంటెలపై ప్రయాణం.. అదే కేదారినాథ్, అమర్నాథ్ యాత్రకు వెళ్తే గుర్రాలపై సవారీ ఉంటుంది.. కానీ సరస్వతీ పుష్కరాల్లో మాత్రం ఎడ్ల బండ్లపై సవారీ సంథింగ్ స్పెషల్..! పార్కింగ్ స్థలం నుండి గోదావరి వరకు హాయిగా ఎడ్ల బండ్లలో సవారీ చేస్తున్న భక్తులు జోరుగా షికారు చేస్తున్నారు. వేసవిలో పంటలు లేవు. ఎలాంటి ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు సరస్వతీ పుష్కరాలు తాత్కాలిక ఉపాధిలా మారాయి.
కాలేశ్వరం త్రివేణి సంగమంలో జరుగుతున్న సరస్వతీ పుష్కరాల సందర్భంగా భక్తులు పోటెత్తుతున్నారు. వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు వాహనాల్లో కాలేశ్వరంకు తరలి వస్తున్నాయి. త్రివేణి సంగంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు పులకరించి పోతున్నారు. వాహనాలు వేలాదీగా తరలి రావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు. వాహనాలను రెండు కిలో మీటర్ల దూరంలో పార్కింగ్ ఏర్పాట్లు చేయిస్తున్నారు. అయితే భక్తులను గోదావరికి నది ఒడ్డుకు చేర్చడం కోసం స్థానిక రైతులు ఎడ్ల బండ్లు కట్టారు. బండెనక బండి కట్టి అన్నట్లు పరిసర గ్రామాల్లోని రైతులంతా గోదావరికి ఎడ్ల బండ్లను బాడుగకు కట్టారు.
పార్కింగ్ స్థలం నుండి భక్తులను ఎడ్ల బండ్లలో నేరుగా గోదావరి పుష్కర ఘాట్ వరకు తీసుకువచ్చి డ్రాప్ చేస్తున్నారు. వాళ్ళు పుష్కర స్నానం ఆచరించిన తర్వాత తిరిగి పార్కింగ్ వద్దకు తీసుకెళ్లి దించుతున్నారు. సాధారణంగా ఆటోకు ఎంత ఛార్జ్ ఇస్తారో ఎడ్ల బండికి కూడా అదే విధంగా డబ్బు తీసుకొని ఇక్కడ రైతులు జీవనోపాధి పొందుతున్నారు. సాధారణంగా దైవదర్శనాలు, విహారయాత్రలకు వెళ్ళినప్పుడు గుర్రపు టాంగాలు, ఒంటెలపై సవారీ చేసే భక్తులు, పర్యటకులు ఇక్కడ ఎడ్ల బండ్లపై సవారీ చేస్తూ ప్రత్యేక అనుభూతిని ఆస్వాదిస్తున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..