Telangana Weather Report: రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ!
రైతులకు గుడ్ న్యూస్.. ఈ ఏడాది సాధారణం కంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. అయితే ఐఎండీ తాజా అంచనాల ప్రకారం రానున్న 3 నుంచి నాలుగు రోజుల్లోనే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయి. ఈ కారణంగా తెలుగురాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

సాధారణంగా నైరుతి రుతుపవనాలు ప్రతి ఏటా మే నెలాఖరు లేదా జూన్ మొదటి వారం మధ్య కేరళ తీరాన్ని తాకుతాయి. అయితే, ఈ సారి ఈ రుతుపవనాలు సాధారణం కంటే ముందుగానే కేరళా తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. మొదట్లో మార్చి 27 నాటికి ఈ రుతుపవనాలు కేరళా తీరాన్ని తాకనున్నాయని చెప్పిన ఐఎండీ తాజాగా మరో తేదీలను ప్రకటించింది. అయితే, నైరుతి రుతపవనాలకు వాతావరణ పరిస్థితుల అనుకూలంగా ఉండడంతో అవి చురుగ్గా కదులుతున్నాయని.. ఈ కారణంగా అనుకున్న తేదీ కన్నా ముందుగానే రుతుపవనాలు కేరళా తీరాన్ని తాకుతాయని ఐఎండీ తెలిపింది. ఐఎండీ ప్రకారం.. రాగల 3-4 రోజులలో ఇవి కేరళ తీరాన్ని తాకనున్నాయి.
నైరుతి రుతుపవనాల కదలికల కారణంగా తూర్పు మధ్య అరేబియన్ సముద్రంలో ఉత్తర కర్ణాటక తీరానికి సమీపంలో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తనం క్రమంగా రాగల 12 గంటల్లో అల్పపీడనంగా ఏర్పడనుందని వాతావారణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం రాగల 36 గంటల్లో ఉత్తర దిక్కులో కదులుతూ క్రమేపి బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. ఉపరితల ఆవర్తనం నుండి కోస్తా ఆంధ్ర తీరం వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో, బుధ, గురు, శుక్రవారం రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అయితే, ఈ కారణంగా రాగల మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుండి ఐదు డిగ్రీలు తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావారణ శాఖ తెలిపింది. మరోవైపు బుధవారం రాత్రి సమయంలో తెలంగాణ లోని అన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
వాతావరణ శాఖ ప్రకారం.. గురువారం తెలంగాణలోని కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్,హన్మకొండ, జనగాం, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




