AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Miss World 2025: తెలగాణలో 500 మంది అనాధలను దత్తత తీసుకున్న మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్… పిల్లలపై పెద్ద మనసు చూపించిన దాతలు

మిస్ వరల్డ్ సీఈవో జూలియా మార్లే మిస్ వరల్డ్ పోటీలను బ్యూటీ విత్ పర్పస్ అనే కాన్సెప్ట్ తో నిర్వహిస్తున్నారు. మిస్ వరల్డ్ సీఈవో జూలియా తెలంగాణపై పెద్ద మనసు చూపించారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 500 మంది పిల్లలను జూలియా మోర్లే దత్తత తీసుకునే కార్యక్రమం చేపట్టింది. దాతలు. అనాధ పిల్లలకు 50 ఐటమ్స్ తో ఉన్న ఒక కిట్ ను డొనేట్ చేశారు.

Miss World 2025:  తెలగాణలో 500 మంది అనాధలను దత్తత తీసుకున్న మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్... పిల్లలపై పెద్ద మనసు చూపించిన దాతలు
Miss World Organization Charity Event In Telangana
Sravan Kumar B
| Edited By: Surya Kala|

Updated on: May 28, 2025 | 8:05 PM

Share

అందాల పోటీల్లో మిస్ వరల్డ్ స్థానం ప్రత్యేకమైనది. మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ రెండు వేర్వేరుగా పోటీలు జరుగుతూ ఉంటాయి. వీటి ఆర్గనైజర్స్ కూడా వేరే. అయితే మిస్ యూనివర్స్ కేవలం అందంగా ఉండటానికి ప్రాధాన్యతను ఇస్తే మిస్ వరల్డ్ మాత్రం అందంతో పాటు మన ఆలోచనలు కూడా అందంగా ఉండాలనేది కాన్సెప్ట్ గా నడుస్తోంది. మిస్ వరల్డ్ సీఈవో జూలియా మార్లే మిస్ వరల్డ్ పోటీలను బ్యూటీ విత్ పర్పస్ అనే కాన్సెప్ట్ తో నిర్వహిస్తున్నారు.

ప్రపంచ సుందరిని ఎంపిక చేసేటప్పుడు అందమైన రూపంతో పాటు వారు చేసే సామాజిక కార్యక్రమాలు సమాజం పై వారికి ఉన్న బాధ్యత సమాజం కోసం వాళ్ళు చేస్తున్న పనుల ఆధారంగా విజేతలను సెలెక్ట్ చేస్తారు. అంతేకాదు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ కూడా చారిటీ వర్క్స్ భారీగానే చేస్తుంది. అయితే మిస్ వరల్డ్ సీఈవో జూలియా తెలంగాణపై పెద్ద మనసు చూపించారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 500 మంది పిల్లలను జూలియా మోర్లే దత్తత తీసుకునే కార్యక్రమం చేపట్టింది. తాను చేస్తున్న మంచి పనిలో అందరికీ భాగస్వామ్యం కల్పించాలని దాతలను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయటం జరిగింది. ఫార్చ్యూన్ హాస్పిటల్ నుంచి డాక్టర్ రామకృష్ణ మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ తో కోలెబరేషన్ అయ్యారు. అందులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా 500 మంది అనాధ పిల్లలను ఏడాది పాటు దత్తత తీసుకొని వారికి కావలసిన అన్ని ఖర్చులను డాక్టర్ రామకృష్ణ భరించనున్నారు.

అయితే మిస్ వరల్డ్ సీఈవో జూలియా ఫార్చ్యూన్ హాస్పిటల్ ని సంప్రదించి తాము చేస్తున్న చారిటీ కార్యక్రమంలో భాగంగా కావాల్సిందిగా కోరిన వెంటనే గొప్ప కార్యక్రమానికి అంగీకారం తెలిపారు దాతలు. అనాధ పిల్లలకు 50 ఐటమ్స్ తో ఉన్న ఒక కిట్ ను డొనేట్ చేశారు. ఇందులో ఓ పెద్ద సూట్కేస్ తో పాటు బెడ్ షీట్, బట్టలు, పుస్తకాలు, టాయిలెట్ కిట్, సోప్స్, ఫేస్ క్రీమ్స్, మాశ్చరైజింగ్ క్రీమ్స్, బేసిక్ మెడిసిన్స్ పెన్నులు పెన్సిళ్ళు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..