AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: నోరూరించే ఫిష్ ఫ్రై.. అందమైన అమ్మాయి.. కట్ చేస్తే.. ఆ తర్వాత సీన్ ఇది

ఈమె పేరు మీరజ్ ఖానమ్‌.. ఇతని పేరు సయ్యద్ జాఫ్రీ.. మీరజ్‌.. హైదరాబాద్‌ బార్కస్ సమీపంలో ఫిష్ ఫ్రై అమ్ముతూ ఉంటుంది.. సయ్యద్ జాఫ్రీ మాత్రం సీసీ కెమెరాలు ఇన్‌స్టలేషన్‌ చేస్తుంటాడు.. వీళ్లద్దరి మధ్య ఎంత సులువుగా ప్రేమ పుట్టిందో.. అంతే త్వరగా బ్రేకప్ అయ్యింది.. ప్రేమికులు కాస్త శత్రువులు అయ్యారు.. దాడులు చేసుకున్నారు.. కేసుల దాకా వెళ్లారు.

Hyderabad: నోరూరించే ఫిష్ ఫ్రై.. అందమైన అమ్మాయి.. కట్ చేస్తే.. ఆ తర్వాత సీన్ ఇది
Representation Image
Ravi Kiran
| Edited By: |

Updated on: May 29, 2025 | 7:57 AM

Share

మీరజ్ ఖానమ్.. ఫిష్ ఫ్రైకి ఫుల్ డిమాండ్‌ ఉంటుంది. టెస్టీ టెస్టీ ఫిష్ ఫ్రై కోసమో.. లేదంటే మీరజ్ ఖానమ్‌ని చూసేందుకో తెలియదు.. యువకులు క్యూ కట్టే వాళ్లు. సయ్యద్ జాఫ్రీ కూడా అలా వెళ్లిన వాడే. ఫస్ట్ డే రోజునే మీరజ్ ఖానమ్‌ను చూసి ఫ్లాట్ అయ్యాడు. ప్రేమించడం కాదూ.. ఏకంగా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఎంత ఇష్టమో చెప్పలేను… కానీ పెళ్లి చేసుకుంటానని మీరజ్ ముందు ప్రపోజల్ పెట్టాడు సయ్యద్. అంతకంటే ముందు తన బ్యాగ్రౌండ్ మొత్తం వివరించింది మీరజ్‌. భర్త లేడని.. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని ఉన్నది ఉన్నట్టు చెప్పేసింది. ఇదేం పెద్ద మ్యాటర్ కాదన్న సయ్యద్‌.. పెళ్లికి సిద్దమన్నాడు. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. కారులో ఢిల్లీ, ముంబై నగరాలకు వెళ్లి సరదాగా గడిపారు.

ఆల్ ఈజ్ వెల్ అనుకునేలోపు ఇద్దరి మధ్య విభేదాలొచ్చాయి. నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు. చివరికది దాడుల దాకా వెళ్లిందట. అందులో నిజమెంతో తెలియదు. కానీ సయ్యద్‌కు మాత్రం గాయాలయ్యాయి. దీంతో పరస్పరం బాలానగర్ పోలీసుల్ని ఆశ్రయించారు. మీరజ్‌ దగ్గర డబ్బు లేకపోయినా తాను ఆదరించానని.. ఇంత చేస్తే దాడి చేసిందని ఆరోపిస్తున్నాడు సయ్యద్‌. ప్రేమించడం నేరం కాదు. ప్రేమలో పడటం తప్పుకాదు. కానీ అన్నీ తెలుసుకుని ముందుకెళ్తే బాగుంటుందని సయ్యద్‌కు కౌంటర్‌ ఇచ్చింది మీరజ్ ఖానమ్. ఇద్దరి వ్యవహారంపై పీఎస్‌లో కేసు నడుస్తోంది. ఇంకోవైపు మీరజ్‌ – సయ్యద్ లవ్ స్టోరీ సోషల్‌ మీడియాలో రీ సౌండ్ చేస్తోంది. మీరజ్‌తో జీవితం పంచుకోవాలని అనుకుంటే.. చివరకు మోసపోవాల్సి వచ్చిందని పెట్టిన వీడియో రచ్చకు దారితీస్తోంది. ఇంతకీ ఎవరు ఎవరిపై దాడి చేశారు? ఎందుకు చేశారు? పెళ్లి దాకా వెళ్లాల్సిన మ్యాటర్‌ ఎందుకు నిలిచిపోయింది. వీటన్నింటికి పోలీసులే సమాధానం చెప్పాలి.

నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?