ఊడిపోయిన జుట్టుని తిరిగి మొలిపించే మ్యాజిక్ సీడ్స్.. ఇలా వాడితే హెయిర్ కలర్ తో పనిలేదు..
నూనెను మీ జుట్టుకు క్రమం తప్పకుండా అప్లై చేయడం వల్ల మీ జుట్టు త్వరలోనే సహజంగా నల్లగా మారుతుంది. నల్ల జీలకర్ర నూనె మిశ్రమాన్ని మీ తలకు పట్టించి, ఒక రోజంతా అలాగే వదిలేయండి. మరుసటి రోజు ఉదయం శుభ్రమైన నీటితో మీ తలను బాగా కడగాలి. ఇది మీ జుట్టును నల్లగా చేయడమే కాకుండా, మందంగా, ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది. ఇది మీ జుట్టు రాలకుండా కంట్రోల్ చేస్తుంది.

నేటి ఆధునిక యుగంలో అభివృద్ధితో పాటు, అస్తవ్యస్థమైన జీవనశైలి ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతోంది. నేటి బిజీ జీవితం కారణంగా చిన్న వయసులోనే ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. జుట్టు రాలడం, బట్టతల, నెరిసిపోయిన జుట్టు వంటి సమస్యలు ఎక్కువ మందిని వేధిస్తున్నాయి. అయితే, జుట్టు పెరుగుదలకు మార్కెట్లో అనేక రకాల నూనెలు అందుబాటులో ఉన్నాయి. కానీ, అవన్నీ కెమికిల్ ఆధారితమైనవి. దాంతో జుట్టు రాలడానికి కారణమవుతాయి, జుట్టు ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయి. దీనికి పరిష్కారంగా కొబ్బరి నూనె అద్భుతాలు చేస్తుంది. ముఖ్యంగా మీరు కొబ్బరి నూనెతో కొన్ని పదార్థాలను కలిపి రాసుకున్నప్పుడు, అది మీ జుట్టును వేర్ల నుండి నల్లగా మారుస్తుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం…
కొబ్బరి నూనె జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కొబ్బరి నూనెలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి కొబ్బరి నూనె ఉత్తమ ఔషధమని నిపుణులు అంటున్నారు. ఇది చుండ్రుకు, తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి ఒక అద్భుత నివారణగా పనిచేస్తుంది. ముఖ్యంగా, నల్ల జీలకర్రను కొబ్బరి నూనెతో కలిపి రాయడం వల్ల జుట్టు మూలాల నుండి నల్లగా మారుతుంది. నల్ల జీలకర్రను తక్కువ మంట మీద వేయించి, ఒక కప్పు కొబ్బరి నూనె వేసి తక్కువ మంట మీద వేడి చేయాలి. ఈ నూనె బాగా మరిగించి చల్లార్చుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న కొబ్బరి నూనె రాత్రి పడుకునే ముందు జుట్టుకు రాసి మసాజ్ చేయండి. ఈ నూనెను మీ జుట్టుకు క్రమం తప్పకుండా అప్లై చేయడం వల్ల మీ జుట్టు త్వరలోనే సహజంగా నల్లగా మారుతుంది. నల్ల జీలకర్ర నూనె మిశ్రమాన్ని మీ తలకు పట్టించి, ఒక రోజంతా అలాగే వదిలేయండి. మరుసటి రోజు ఉదయం శుభ్రమైన నీటితో మీ తలను బాగా కడగాలి. ఇది మీ జుట్టును నల్లగా చేయడమే కాకుండా, మందంగా, ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది. ఇది మీ జుట్టు రాలకుండా కంట్రోల్ చేస్తుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








