AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుమ్మడి గింజలు ఎక్కువగా తింటున్నారా..? ఇలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ తప్పవు మరీ..!

గుమ్మడి గింజలతో అలెర్జీ ఉన్నవారిలో అతిగా తినటం వల్ల తీవ్రమైన గొంతు నొప్పి, తుమ్ములు వస్తాయి. గుమ్మడి గింజలు తరచుగా తినడం వల్ల కొంతమందిలో బీపీ తగ్గుతుంది. ఇప్పటికే లో బీపీ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు వీటిని తినకపోవటమే ఉత్తమం అంటున్నారు. అలాగే, చిన్న పిల్లలకు గుమ్మడి గింజలు ఇవ్వకూడదు. అవి గొంతులో ఇరుక్కుపోవచ్చు. పెద్దలు కూడా వాటిని బాగా నమిలి తినాలి.

గుమ్మడి గింజలు ఎక్కువగా తింటున్నారా..? ఇలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ తప్పవు మరీ..!
గుమ్మడి గింజలు అలెర్జీలను కలిగిస్తాయి. గొంతు నొప్పి, తుమ్ములు వస్తాయి. గొంతులో చికాకు, దగ్గుతోపాటు తలనొప్పికీ కారణం అవుతాయి. ఇంకొందరిలో చర్మంపై దద్దుర్లు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిస్తే.. గుమ్మడి విత్తనాలను తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Jyothi Gadda
|

Updated on: May 29, 2025 | 10:41 AM

Share

గుమ్మడి గింజలు అనేక ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంటాయి. అందుకే వీటిని రెగ్యులర్‌గా మనం డైట్‌లో యాడ్ చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుమ్మడి గింజల్లో విటమిన్ ఇ, ఫైబర్, ఐరన్, కాల్షియం, బి 2, ఫోలేట్, బీటా కెరోటిన్, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి, శరీరానికి అనేక రకాలుగా ఉపయోగపడతాయి. కాబట్టి, వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం చాలా మంచిది. అయితే, ఏదైనా సరే అతిగా తినటం వల్ల అనర్థాలకు దారితీస్తుందని మనందరికీ తెలిసిందే.. గుమ్మడి గింజల విషయంలో కూడా అంతే. గుమ్మడి గింజల్ని ఎక్కువగా తినటం వల్ల తీవ్ర సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

గుమ్మడి గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా తినటం వల్ల తీవ్రమైన కడుపు నొప్పి, విరేచనాలు కలిగించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే, గుమ్మడి గింజలు కొంతమందిలో బరువు పెరగడానికి కారణం అవుతాయి. మరికొంత మందిలో ఇవి అలెర్జీలను కూడా కలిగిస్తాయని చెబుతున్నారు.

గుమ్మడి గింజలతో అలెర్జీ ఉన్నవారిలో అతిగా తినటం వల్ల తీవ్రమైన గొంతు నొప్పి, తుమ్ములు వస్తాయి. గుమ్మడి గింజలు తరచుగా తినడం వల్ల కొంతమందిలో బీపీ తగ్గుతుంది. ఇప్పటికే లో బీపీ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు వీటిని తినకపోవటమే ఉత్తమం అంటున్నారు. అలాగే, చిన్న పిల్లలకు గుమ్మడి గింజలు ఇవ్వకూడదు. అవి గొంతులో ఇరుక్కుపోవచ్చు. పెద్దలు కూడా వాటిని బాగా నమిలి తినాలి.

ఇవి కూడా చదవండి

అయితే, వీటిని సరైన పద్ధతిలో తిన్నప్పుడు మాత్రమే వాటి పూర్తి ప్రయోజనాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. గుమ్మడి గింజలను సలాడ్, గ్రానోలా బార్‌లు, స్మూతీలు వంటి వంటకాలలో చేర్చుకుని తీసుకొచ్చు. లేదంటే దొరగా వేయించుకుని కూడా తీసుకొవచ్చు అంటున్నారు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
మల్లన్న భక్తులకు అలెర్ట్.. ఆ రోజు శ్రీశైల క్షేత్రం మూసివేత
మల్లన్న భక్తులకు అలెర్ట్.. ఆ రోజు శ్రీశైల క్షేత్రం మూసివేత
బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లకు గుడ్ న్యూస్.. ఆర్బీఐ కీలక ఆదేశాలు..
బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లకు గుడ్ న్యూస్.. ఆర్బీఐ కీలక ఆదేశాలు..
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు బిగ్ షాక్.. ఛార్జీలు పెంపు..
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు బిగ్ షాక్.. ఛార్జీలు పెంపు..
చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తండ్రి సౌందర్ రాజన్ మృతి
చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తండ్రి సౌందర్ రాజన్ మృతి
రోజూ ఒక నారింజ తింటే ఇన్ని లాభాలా..? ఏయే రోగాలను నయం చేస్తుందంటే
రోజూ ఒక నారింజ తింటే ఇన్ని లాభాలా..? ఏయే రోగాలను నయం చేస్తుందంటే
IND vs WI మ్యాచ్ కాదు భయ్యో.. 10 ఏళ్ల నాటి పగ..!
IND vs WI మ్యాచ్ కాదు భయ్యో.. 10 ఏళ్ల నాటి పగ..!
వీరిని పెళ్ళి చేసుకుంటే రోజూ గొడవలు జరుగుతాయి.. ఏయే రాశులంటే?
వీరిని పెళ్ళి చేసుకుంటే రోజూ గొడవలు జరుగుతాయి.. ఏయే రాశులంటే?
రెండు పీపీఎఫ్ అకౌంట్లు తెరవొచ్చా..? కేంద్రం కొత్త రూల్ ఇదే..
రెండు పీపీఎఫ్ అకౌంట్లు తెరవొచ్చా..? కేంద్రం కొత్త రూల్ ఇదే..
జింబాబ్వేపై విజయం.. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో అరుదైన సీన్..
జింబాబ్వేపై విజయం.. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో అరుదైన సీన్..
స్వర్గం నిజంగా ఉందా.. ఏకంగా అడ్రస్ చెబుతున్న సైంటిస్ట్..
స్వర్గం నిజంగా ఉందా.. ఏకంగా అడ్రస్ చెబుతున్న సైంటిస్ట్..