Konda Surekha: మంత్రి కొండా సురేఖపై భగ్గుమంటున్న వరంగల్‌ ఎమ్మెల్యేలు.. ఏకంగా అధిష్టానానికి కంప్లైంట్‌!

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడంతా మంత్రి కొండా సురేఖే హాట్‌టాపిక్‌.. నిన్నమొన్నటి వరకు.. అక్కినేని ఫ్యామిలీ మీదుగా కేటీఆర్‌పై చేసిన కామెంట్స్‌ కాకరేపితే.. ఇప్పుడామెను వరంగల్‌ జిల్లా సొంత పార్టీ ఎమ్మెల్యేలే టార్గెట్‌ చేయడం చర్చనీయాంశం అవుతోంది.

Konda Surekha: మంత్రి కొండా సురేఖపై భగ్గుమంటున్న వరంగల్‌ ఎమ్మెల్యేలు.. ఏకంగా అధిష్టానానికి కంప్లైంట్‌!
Konda Surekha
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Oct 17, 2024 | 11:04 AM

ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీసీ సామాజిక వర్గం చెందిన మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ పొలిటికల్ సర్క్యూట్స్ లో హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ట్రోల్ చేశారని, దాని వెనక ఆ పార్టీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఉన్నారంటూ.. ఆరోపిస్తూ చేసిన వ్యాఖ్యలతో పొలిటికల్ కాట్రవర్సీ అయింది. సినిమా సెలబ్రిటీలతో కేటీఆర్‌కు లింక్స్ అంటూ చేసిన కామెంట్స్ సంచలనం రేపాయి అప్పటి నుండి కొండా సురేఖ వార్తల్లో ఉంటున్నారు.

సినీ నటులు నాగార్జునకు చెందిన N కన్వెన్షన్ కూల్చివేత నుండి మొదలైన మంత్రి కొండా సురేఖ కాంట్రవర్సీ.. ప్రస్తుతం సొంత జిల్లాలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫ్లెక్సీ వివాదంతో ప్రత్యక్ష ఫిర్యాదుల దాకా వెళ్లింది. ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి చర్యలు తీసుకోవాలని వరంగల్ జిల్లా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. తమ తమ నియోజిక వర్గాల్లో జరిగే వ్యవహారాల్లో ఉద్దేశపూర్వకంగా కలగచేసుకుని తమకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని పలువు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీకి ఫిర్యాదు చేయడంతో రాజకీయంగా చర్చకు దారితీస్తోంది.

ఫిర్యాదు చేసినవారిలో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్. నాగరాజు, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, భూపాల పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య ఉన్నట్లు తెలిస్తోంది. ప్రోటోకాల్ ప్రభుత్వ కార్యకలాపాలు వ్యక్తిగత వ్యవహారాల్లో మంత్రి కొండా సురేఖ జోక్యం చేసుకోవడం నచ్చడం లేదని సదరు నాయకులు ఆరోపిస్తున్నారు.

ఏఐసీసీ తెలంగాణ చీఫ్‌తోపాటు టీపీసీసీకి ఫిర్యాదు చేయడమే కాకుండా ఢిల్లీ హై కమాండ్ వరకు కొండా సురేఖ వివాదం వెళ్లిందంటూ ప్రచారం సాగుతోంది. మంత్రి కొండా సురేఖ విషయం లో మాట్లాడాలంటూ ఏఐసీసీ కార్యదర్శి KC వేణుగోపాల్ అపాయింట్‌మెంట్ వరంగల్ ఎమ్మెల్యేలు కోరినట్లు తెలుస్తోంది. అయితే, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీప్‌దాసు మున్షీ.. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ హామీతో ఎమ్మెల్యేలు ఢిల్లీ టూర్ ప్రస్తుతం వాయిదా వేసుకున్నట్లు సమాచారం. సమస్య పరిష్కారం చేస్తాం.. పరిష్కారం కాకపోతే అప్పుడు డిల్లీకి వెళ్ళండి అని సర్దిచెప్పడంతో ఢిల్లీ వెళ్లడం వాయిదా వేసుకున్నట్లు తెలిసింది.

మరో వైపు బీసీ మహిళా నేతగా మంత్రిగా ఉన్న తనను కావాలనే బద్నాం చేస్తున్నారని కొండా సురేఖ ఆరోపిస్తున్నారు. కేటీఆర్ తనపై విషప్రచారం చేసిన సమయంలో తాను చేసిన కామెంట్స్ పై సైతం కుట్రలో భాగంగానే రాద్ధాంతం చేశారని విమర్శిస్తున్నారు. మరి.. కొండా సురేఖ ఎపిసోడ్‌కు తెలంగాణ కాంగ్రెస్‌ ఎలా ఫుల్‌స్టాప్‌ పెడుతుందో చూడాలి..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..