AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KCR: గులాబీ దళపతి ఎందుకు సైలెంట్ అయ్యారు? జనంలోకి మాజీ సీఎం రాక అప్పుడేనా..?

తెలంగాణ మాజీ సీఎం కేసీఆఆర్‌ జనానికి కనిపించి చాలా రోజులైపోయింది. ఆ మధ్య అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఓ రోజు సభకు హాజరయ్యారు అంతే. జిల్లాల నుంచి వచ్చిన క్యాడర్, లీడర్లతో అప్పుడప్పుడు ఫాంహౌస్‌లోనే సమావేశాలు నిర్వహించారు.

KCR: గులాబీ దళపతి ఎందుకు సైలెంట్ అయ్యారు? జనంలోకి మాజీ సీఎం రాక అప్పుడేనా..?
BRS Chief KCR
Rakesh Reddy Ch
| Edited By: |

Updated on: Oct 17, 2024 | 1:09 PM

Share

కేసీఆర్ రాజకీయ వ్యూహాల్లో మౌనానిది కీలక పాత్ర. ఆయన కీలకమైన విషయాల్లో మౌనంగా ఉంటారు. సరైన సమయం చూసి ఎంటర్ అవుతారు. మరి ఇన్ని ఇష్యూస్‌ ఉన్నా కేసీఆర్ రియాక్ట్‌ కాకపోవడానికి కారణం ఏంటి..? అధికార పార్టీకి టైమ్‌ ఇస్తున్నారా..? సమయం కోసం ఎదురు చూస్తున్నారా..? అన్న చర్చ తెలంగాణ వ్యాప్తంగా సాగుతోంది.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల ప్రచారం మినహా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ బయటకు రాలేదు. మధ్యలో ఒక్కసారి మాత్రం తెలంగాణ భవన్ లో సమావేశం ఏర్పాటు చేసి శాసనమండలి నేతగా మధుసూదనాచారిని ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఇక ప్రజా సమస్యల విషయంలో, ప్రభుత్వం వ్యతిరేకతపై, ఇప్పటివరకు ఈ తెలంగాణలో హాట్ హాట్ గా ఉన్న హైడ్రా, మూసి పరివాహక బాధితులు, రైతులు, రుణమాఫీ ఇలా ఏ అంశం లోను కనీసం ప్రెస్ నోట్ కూడా విడుదల చేయలేదు.

తెలంగాణలో ఎంత రచ్చ జరుగుతున్న ఆయన మాత్రం ఫామ్ హౌస్ కే పరిమితవయ్యారు. ఇందుకు కారణం కొత్తగా ఏర్పాట ప్రభుత్వానికి కనీసం ఏడాదైనా సమయం ఇవ్వాలని ఆయనే మొదట్లోనే చెప్పారు. పార్టీ నేతలు కూడా కేసీఆర్ బయటకు రావాలని ప్రజల తరపున నిలబడాలని ప్రజలు కోరుకుంటున్నా ఆయన మాత్రం ప్రభుత్వం హనీమూన్ పీరియడ్ అయిపోయిన తర్వాతే ఆయన మాట్లాడతారు అంటూ చెప్పుకొచ్చారు.

గత ఏడాది డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఈ డిసెంబర్ తో ప్రభుత్వానికి వన్ ఇయర్ కంప్లీట్ అవుతుంది. దీంతో కెసిఆర్ ప్రజలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం ఏర్పాట్లు కూడా చేస్తున్నాయి. ఇప్పటికే పార్టీ చేపడుతున్న కార్యకలాపాల్లో కేసీఆర్ బ్యాక్ గ్రౌండ్ లో విహాత్మకంగా వ్యవహరిస్తున్న… ఇకపై ఫ్రంట్ రోలో నిలబడబోతున్నారని పార్టీ నేతలు చెప్తున్నారు. రైతుల సమస్యల నుంచి గ్రేటర్ హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతల వారికి ప్రతి అంశంపై కేసీఆర్ డిసెంబర్ లో స్పందించబోతున్నారు. కేవలం ప్రెస్ మీట్ కె పరిమితం కాకుండా ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాల్లోనూ పాల్గొననున్నారు.

జిల్లా యాత్రలు కూడా చేయబోతున్నట్లు సమాచారం. డిసెంబర్లో కేసిఆర్ పూర్తి రాష్ట్రస్థాయి కమిటీతోపాటు, జిల్లా మండల కేంద్రాల్లోనూ పార్టీ కమిటీలను నియమిస్తారు. అనేక ఆందోళన కార్యక్రమాలకు రూపకల్పన చేసి ఆయనే స్వయంగా పాల్గొనబోతున్నారు. ఒక ఏడాది కాలంగా కేసిఆర్ స్పీచ్ లను మిస్ అయిన తెలంగాణ ప్రజలకు ఇక డిసెంబర్‌లో ఫుల్ మీల్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..