Watch Video: వినూత్నంగా రక్షాబంధన్ వేడుక.. గొప్ప సందేశం ఇచ్చిన విద్యార్ధులు!
రాఖీ పౌర్ణమి వచ్చిందంటే చాలు తోడబుట్టిన అక్కా చెల్లిల్లు ఆనందగా అన్న దమ్ముల్లకు రాఖీలు కడుతూ మురిసిపోతారు. ఆ బంధం అంత బలమైనది. ఉమ్మడి ఆదిలాబాద్ లో మాత్రం ఈ బందం జన్మ జన్మలది అంటున్నారు అక్కడి విద్యార్థులు. నిర్మల్ జిల్లా జామ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వృక్షాలను రక్షిద్దాం అంటూ..

ఆదిలాబాద్, ఆగస్ట్ 28: నీడ నిచ్చి గూడు నిచ్చి ప్రాణవాయువునిచ్చి ప్రాణాలు కాపాడుతున్న వృక్షాలకు మేమంతా రక్షా అంటున్నారు విద్యార్థులు. తోడబుట్టిన అన్నదమ్ముల్ల రక్ష కోసం కట్టే రాఖీబందన్ వేళ వృక్షో రక్షతి రక్షిఃత అంటూ చెట్టు చెట్టుకు ప్రకృతి మయమైన రాఖీలను కట్టి భళా అనిపించుకున్నారు అక్కడి విద్యార్థులు. విద్యార్థులే కాదు ప్రకృతి ప్రేమికులు, అటవిశాఖ అదికారులు అంతా కలిసి వృక్షా బందన్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. రక్షాబందన్ వేళ వృక్షా బందనం కూడా అంటున్న ఉమ్మడి ఆదిలాబాద్ పై స్పెషల్ రిపోర్ట్..
రాఖీ పౌర్ణమి వచ్చిందంటే చాలు తోడబుట్టిన అక్కా చెల్లిల్లు ఆనందగా అన్న దమ్ముల్లకు రాఖీలు కడుతూ మురిసిపోతారు. ఆ బంధం అంత బలమైనది. ఉమ్మడి ఆదిలాబాద్ లో మాత్రం ఈ బందం జన్మ జన్మలది అంటున్నారు అక్కడి విద్యార్థులు. నిర్మల్ జిల్లా జామ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వృక్షాలను రక్షిద్దాం అంటూ వృక్ష రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వృక్షాలకు రాఖీలు కట్టి చెట్లతో మనిషికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం జామ్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులు ఈరోజు తమ పాఠశాల ఆవరణలోని చెట్లకు రాఖీలు కట్టారు. అటవీ సంరక్షణ అధికారి నజీర్ ఖాన్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. ముందుగా విద్యార్థులు పర్యావరణహితంగా కదంబ ఫలానికి తాటి నార ను ఉపయోగించి ప్రత్యేక రాఖీలను తయారు చేశారు. అనంతరం సామూహికంగా పాఠశాల ఆవరణలోని ప్రతి ఒక్క చెట్టుకు రాఖీలను కట్టారు. సదరు చెట్లను కాపాడుకుంటాం అని తెలిపారు.
అటు ప్రకృతి మిత్ర ఆధ్వర్యంలో వృక్ష రక్షాబంధన్ కార్యక్రమాన్ని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామ్ చెరువు పార్కులో ఘనంగా నిర్వహించారు. ప్రకృతి ప్రేమికులు, ఫారెస్ట్ అధికారులు చెట్లకు రాఖీలు కట్టి వాటిని తమ సొంత కుటుంబ సభ్యుల్లా కాపాడతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, చెట్ల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, చెట్లు మనకు ప్రాణవాయువు, నీడతో పాటు పర్యావరణ సమతుల్యతను అందిస్తున్నాయని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని, వృక్షాలను కాపాడటమే మన భవిష్యత్తును కాపాడటమని, భావితరాలకు పచ్చని వాతావరణాన్ని అందించేందుకు అందరూ కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు.




